సిర్పూర్ (టి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ (టి) మండలంలోని పెద్ద బండ ఫారెస్ట్ బీట్ భీమన్నదేవర సమీపంలో అచెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపలదారులు శేఖర్, సుశీల మృతదేహాలు గురువారం రాత్రి లభ్యం కావడం కలకలం రేపింది. కాగజ్నగర్ డిఎస్పి, అటవీశాఖ అధికారులు(Forest officials) సంఘటన స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఎలుగుబంటి దాడిలో మృతి చెందినట్లు అటవీశాఖ అధికా రులు తెలిపారు. మృతులకు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు.
Read Also: Asia Cup 2025: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా

విషయం తెలుసుకున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విట్టల్ సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. మృతికిగల కారణాలు అడిగి తెలు సుకున్న ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందే సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని బాధిత కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల సమగ్ర నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒక రికి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఫోరానిక్స్(Foranics) వారు ఇచ్చిన సమాచారంతో మృతులు ఎలుగుబంటి దాడిలో మరణించినట్లు ఎఫ్డిఓ సుశాంత్ కుమార్ తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒకరికి పదిలక్షలచొప్పున ఎక్స్రేషియా అందిస్తామన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు బాధిత కుటుంబానికి పదివేల రూపాయల అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: