ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ. లక్షల్లో మోసం నెల్లూరు క్రైమ్ : విజయవాడలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి తన పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి లక్షల్లో నగదుగా కాజేసిన నిందితుడిని, అతనికి సహకరించిన అతని తండ్రిని వేదాయపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. Andhra Pradesh పోలీసుల కథనం మేరకు… న్యూ మిలటరీ కాలనీకి చెందిన తూపిలి వినోద్ కుమార్ను Thupili Vinod Kumar స్థానిక తెలుగు గంగ కాలనీ ఎదురుగా ఉన్న రాయల్ రెసిడెన్సిలో నివసించే దేవళ్ల సాయికృష్ణ అనే వ్యక్తి తాను విజయవాడ క్రైమ్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. బీటెక్ B.Tech పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వినోద్ కుమారు తన పలుకుబడితో అటవీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన వినోద్ కుమార్ పలు దఫాలుగా రూ.
Amalapuram : వాసవీ అమ్మవారికి కోట్ల కరెన్సీతో అలంకారం

Nelluru
10 లక్షలకు పైబడి నగదు అందజేశాడు. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో సాయికృష్ణ గురించి వాకబు చేయగా అతను పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి కాదని తెలియడంతో మోసపోయానని గ్రహించి వేదాయపాలెం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఈ నెల 24వ తేదీ ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన వేదయపాలెం స్టేషన్ సీఐ కే శ్రీనివాసరావు విచారణలో ఇదే తరహాలో సాయికృష్ణ Sai Krishna పలువురిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి రూ.51 లక్షలు నగదు తీసుకున్నట్లు వెల్లడైంది. Andhra Pradesh సాయికృష్ణ తండ్రి తూపిలి పోలయ్య సహకారంతోనే సాయికృష్ణ ఇటువంటి మోసాలకు పాల్పడ్డాడని, మోసం ద్వారా సంపాదించిన నగదును పోలయ్య బ్యాంకు ఖాతాలో ఉంచుతూ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
డూప్లికేట్ పోలీస్ ఐడి కార్డు
నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి డూప్లికేట్ పోలీస్ ఐడి కార్డు, వైద్యుడి పేరుతో డూప్లికేట్ ఐడి కార్డు, పోలీస్ అధికారులు ధరించే యూనిఫామ్, సాక్సులు బ్యాడ్జీలు, బీఎండబ్ల్యూ కారు, ఒక స్కూటీ, రెండు ఖరీదైన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తక్కువ సమయంలో పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన వేదయపాలెం సిఐ కె శ్రీనివాసరావు, ఎస్సై శ్రీనివాసరావు ఇతర స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, నగర డి.ఎస్.పి DSP సింధుప్రియలు అభినందించారు.
నిందితుడు ఎవరు?
దేవళ్ల సాయికృష్ణ అనే వ్యక్తి, తాను విజయవాడ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి మోసాలు చేశాడు.
అతను ఎలాంటి మోసం చేశాడు?
ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి నుండి రూ. లక్షల్లో నగదు తీసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: