నిత్యం నిమ్మకాయ నీరు తాగే అలవాటు వల్ల శరీరానికి అనేక రకాలుగా లాభం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం రుచికే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఒక సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలసట తగ్గించడం మొదలుకుని, జీర్ణక్రియ మెరుగుపరిచే వరకు నిమ్మకాయ నీరు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
సహజ శక్తిని అందించే టానిక్
నిమ్మకాయలో పుష్కలంగా ఉండే విటమిన్ C మరియు ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మీరు అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నిమ్మకాయ నీరు తాగితే, శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది.
హైడ్రేషన్ & డిటాక్స్
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగితే, శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హైడ్రేషన్(Hydration)తో పాటు, డిటాక్సిఫికేషన్‌కు ఇది సరైన మార్గం.

రోగనిరోధక శక్తి పెంపుకు సహాయం
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు నిమ్మరసంలో ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. జలుబు, ఫ్లూ, ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహకరిస్తుంది.
బరువు తగ్గించాలనుకునేవారికి తోడ్పాటు
నిమ్మరసం జీవక్రియ రేటును (metabolism) పెంచుతుంది. ఇది ఆకలిని తగ్గించి, ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా, బరువు తగ్గే ప్రక్రియలో సహజమైన మార్గంగా పనిచేస్తుంది.
జీర్ణక్రియకు తోడ్పాటు
గోరువెచ్చని నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అమ్లత, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తాగడం వల్ల అజీర్తి సమస్యలు మానిపోతాయి.
చర్మానికి ఆరోగ్యం, మెరుగు
నిమ్మకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచివి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
గుండె ఆరోగ్యం & రక్తపోటు నియంత్రణ
విటమిన్ C మరియు ఇతర పోషకాల వలన, నిమ్మరసం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
దంత ఆరోగ్యానికి ఉపయోగకరం
నిమ్మరసం దంత సమస్యలైన పంటి నొప్పి, చిగురువాపు, కేవిటీస్ నివారణలో సహాయపడుతుంది. శ్వాసతాజాగా ఉండేలా చేస్తుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే పళ్లపై ఎమెల్ దెబ్బతినే అవకాశముంది, కాబట్టి మితంగా తాగాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: