జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency) ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత (Maganti Sunitha) ను ప్రకటించడంపై అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ సీటు ఖాళీ అయిన తర్వాత వివిధ పేర్లు వినిపించినా, చివరకు పార్టీ అధిష్ఠానం సునీతపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించింది.
Srishti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసు..సంచలన విషయాలను వెల్లడించిన ఈడీ

ప్రత్యేక కృతజ్ఞతలు
అభ్యర్థిగా ప్రకటించబడిన వెంటనే సునీత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ (KCR) గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “నా మీద విశ్వాసం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ జూన్ 8న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: