రీసెంట్‌గా ఇండస్ట్రీ (Cinema Industry)లో గ్లామర్ రోల్స్ పై దృష్టి పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం పద్ధతిగా, పద్ధతి గా కనిపించే హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల్లో డిమాండ్ పెరుగుతున్న ప్రకారం ఎలాంటి పాత్ర అయినా స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. సినిమా కథకు, పాత్రకు సరిపోయే విధంగా వారు తమ ఇమేజ్‌లో మార్పులు తీసుకుంటున్నారు.
Sumathi Valavu Movie: సుమతి వలవు (జీ 5) మూవీ రివ్యూ
టాలీవుడ్ (Tollywood) లో ఎంతో మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కూడా దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్నపాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ (Anupama Parameshwaran).. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది.
తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.

ఓ జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యింది
మీడియా రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. ఇటీవలే కిష్కిందాపురి సినిమా (Kishkindapuri Movie) తో మరో విజయాన్ని అందుకుంది. తాజాగా అనుపమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుపమ ఓ జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యింది.
డీజే టిల్లు సినిమా (DJ Tillu movie) లో గ్లామరస్ గా కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పడంతో అనుపమ సీరియస్ అయ్యింది. అనుపమ మాట్లాడుతూ.. మొన్న నేను పరదా అనే సినిమా చేశాను మీరు చూశారా వెళ్లి.. ? అది చూస్తే మీరు హ్యాపీ అయ్యేవారు. మీరు చూడలేదు అందుకే మూవీ వర్క్ అవ్వలేదు. ఇది ఎవ్వరూ మాట్లాడారు. మంచి సినిమా చేస్తే చూడరు కానీ టిల్లు స్క్వేర్ లో డైజెస్ట్ చేసుకోలేకపోయా అంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: