हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..

Sudha
Latest Telugu news : Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..

మార్కెట్‌లో మ‌న‌కు ర‌క‌ర‌కాల కూర‌గాయ‌లు ల‌భిస్తుంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉండే రెగ్యుల‌ర్ కూర‌గాయ‌ల‌నే మ‌నం తెచ్చుకుని వండి తింటుంటాం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం చిత్రాతిచిత్ర‌మైన కూర‌గాయ‌ల‌ను కూడా చూస్తుంటాం. అస‌లు వాటిని కూర‌గాయ‌లు అంటారా, అవి ఏమిటి.. వాటిని ఎలా తినాలి..? అని కూడా సందేహిస్తుంటాం. కానీ అలాంటి కూర‌గాయ‌ల్లోనే అనేక పోష‌కాలు ఉంటాయి. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇప్పుడు చెప్ప‌బోయే కూర‌గాయ కూడా స‌రిగ్గా అలాంటిదే. అదే.. లింగాడ్‌. (Lingad) దీన్నే లింగ‌డ్ అని, లుంగుడు క‌స్రోడ్ అని కూడా పిలుస్తారు. ఈ కూర‌గాయ చూసేందుకు చాలా చిత్రంగా ఉంటుంది. ఇది ఫెర్న్ జాతికి చెందిన మొక్క లాగా క‌నిపిస్తుంది. మ‌న దేశంలో హిమాల‌య పర్వత ప్రాంతాల్లో ఈ కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా పండిస్తారు. ఈ కూర‌గాయ‌ను తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits) అందిస్తాయి.

  Lingad - ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..
Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..

జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా..

లింగాడ్ (Lingad) కూర‌గాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ స‌మ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా నివారించ‌వ‌చ్చు. ఈ కూర‌గాయ‌ల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మార్పు చెందుతుంది. విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రేచీక‌టిని త‌గ్గిస్తుంది. ఈ కూర‌గాయ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ‌శ‌క్తిని మెరుగు ప‌రుస్తుంది. దీని వ‌ల్ల ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. క‌డుపు ఉబ్బ‌రం నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది

లింగాడ్ (Lingad) కూర‌గాయ‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. దీని వ‌ల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు త‌గ్గిపోతాయి. ఈ కూర‌గాయ‌లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఈ కూర‌గాయ‌ల్లో అధికంగా ఉండే పొటాషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. బీపీని నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తుంది. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఈ కూర‌గాయ‌ల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సైతం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి కూడా ఇవి మేలు చేస్తాయి. ఈ కూర‌గాయ‌ల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి క‌డుపు నిండిన భావ‌నను క‌లిగిస్తాయి. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.

  Lingad - ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..
Lingad – ఈ కూర‌గాయ‌లో పోష‌కాలు అనేకం..

సీజ‌న్‌లోనే క‌నిపిస్తాయి

100 గ్రాముల లింగాడ్ కూర‌గాయ‌ల‌ను తింటే సుమారుగా 35 నుంచి 45 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. ప్రోటీన్లు 2 నుంచి 6 గ్రాములు, ఫైబ‌ర్ 4 గ్రాములు, విట‌మిన్లు ఎ, సి, బి విట‌మిన్లు, పొటాషియం, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్ వంటి మిన‌ర‌ల్స్ వీటిల్లో అధికంగా ఉంటాయి. లింగాడ్ కూర‌గాయ‌లు మ‌న‌కు సీజ‌న్‌లోనే క‌నిపిస్తాయి. వ‌ర్షాకాలంలో మ‌నం వీటిని మార్కెట్‌లో చూడ‌వ‌చ్చు. వీటిని వండే ముందు శుభ్రంగా క‌డిగి క‌ట్ చేసి వండాల్సి ఉంటుంది. పూర్తిగా ఉడ‌క‌ని లేదా శుభ్రంగా క‌డ‌గ‌ని లేదా ప‌చ్చి లింగాడ్ కూర‌గాయ‌ల‌ను తింటే విషంగా మారే ప్ర‌మాదం ఉంటుంది. కొంద‌రికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. ఈ కూర‌గాయ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా చేసుకునే కూర‌లు, వేపుళ్ల మాదిరిగా లేదా ప‌చ్చ‌ళ్ల మాదిరిగా చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ వీటిని తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

కూరగాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, మరియు ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మీ ఆహారంలో కూరగాయలను చేర్చుకోవడం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్యారెట్‌లు కంటి చూపును మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి మరియు బరువు నియంత్రణలో ఉపయోగపడతాయి. వీటిలో బీటా-కెరోటిన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870