हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Bathukamma: సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Hema
Bathukamma: సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సమిష్టి భక్తి భావానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచిన విశిష్టమైన ఉత్సవం. ప్రతి పండుగ పరంపరానుగతంగా విశిష్ట పద్ధతిలో జరుపుకునే ధార్మిక కార్యాచరణాసక్తుల నిలయమైన తెలంగాణలో సోదరీ మణులైన జేష్టాదేవి, లక్ష్మీదేవిలను కొలుస్తూ బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను పక్షం రోజుల (days) తేడాతో నిర్వహించడం సనాతన సంప్రదాయం. బతుకమ్మను పూలతో పేర్చి మధ్యలో పసుపు గౌరమ్మను ఉంచి ఆరాధించే విధానం శ్రీచక్ర ఉపాసనలోని మేరు ప్రస్థానం పోలికతో శక్తి ఆరాధనకు ప్రతీకగా కనిపిస్తుంది. తెలంగాణ (Telangana) స్త్రీలు గౌరమ్మను గౌరీ, లక్ష్మి, సరస్వతుల త్రిగుణాత్మక స్వరూపిణిగా భావించి పూజిస్తారు. “శ్రీలక్ష్మీ నీ మహిమలు గౌరమ్మా..” అంటూ గానం చేస్తూ ఆట-పాటలతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.

భాద్రపద అమావాస్య(మహాలయ అమావాస్య) నాడు ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో ఆరంభమై ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున ‘సద్దుల బతుకమ్మ’తో ముగిసే తొమ్మిది రోజుల ఉత్సవం తెలంగాణ స్త్రీల ఉత్సాహాన్ని, ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ తొమ్మిది రోజుల ఉత్సవం ప్రతిరోజు ఒక్కో ప్రత్యేకతతో జరుగుతుంది.

 Bathukamma
Bathukamma

తొమ్మిది రోజుల బతుకమ్మ

మొదటి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ‘. ఇది భాద్రపద అమావాస్యనాడు ప్రారంభమవుతుంది. ఈ రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలతో నైవేద్యం చేసి బతుకమ్మను పూజిస్తారు.

రెండవ రోజు ఆశ్వయుజ పాడ్యమి నాడు ‘అటుకుల బతుకమ్మ’ జరుపుతారు. ఈ రోజున సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం చేస్తారు.

మూడవ రోజు ఆశ్వయుజ విదియనాడు ‘ముద్దపప్పు బతుకమ్మ‘ నిర్వహిస్తారు. పసుపు, కందిపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం చేస్తారు.

నాలుగవ రోజు ఆశ్వయుజ తృతీయనాడు ‘నాన బియ్యం బతుకమ్మ‘ ఉంటుంది. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో బతుకమ్మకు నైవేద్యం సమర్పిస్తారు.

ఐదవ రోజు అంటే ఆశ్వయుజ చవితినాడు ‘అట్ల బతుకమ్మ‘ నిర్వహిస్తారు. ఈ రోజున అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు ఆశ్వయుజ పంచమి నాడు ‘అలిగిన బతుకమ్మ‘ జరుపుతారు. ఈరోజు నైవేద్యం సమర్పించరు దీనిని ఆరామ దినంగా భావిస్తారు.

ఏడవ రోజు ఆశ్వయుజ షష్ఠినాడు ‘వేపకాయల బతుకమ్మ‘ ఉంటుంది. బియ్యప్పిండిని వేయించి వేప కాయలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు ఆశ్వయుజ సప్తమి నాడు ‘వెన్నముద్దల బతుకమ్మ’ నిర్వహిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లంతో నైవేద్యం చేస్తారు.

తొమ్మిదవ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు ‘సద్దుల బతుకమ్మ’ ఘనంగా జరుగుతుంది. ఈ రోజున ఐదు రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల సద్దులు (పులిహోర), పెసరపప్పు కూర, కందిపప్పు కూర, బెల్లం, తీపి వంటకాలు సమర్పిస్తారు. ఇదే రోజు దుర్గాష్టమి కావడంతో నియమ నిష్టలతో దుర్గాదేవిని ఆరాధిస్తారు.

 Bathukamma
Bathukamma

గ్రామాల పొలిమేరలు, పంటచేలు, ఊరి చెరువులు.. అన్ని బతుకమ్మ పూల సువాసనతో నిండిపోతాయి. తంగేడు, గునుగు, సీతమ్మవారిజడ, బంతి, చేమంతి, గన్నేరు, కట్ల, గోరింట, గుమ్మడి, మల్లె, మందారం మొదలైన పూలతో బతుకమ్మలను పేరుస్తారు.తొమ్మిది రోజులూ పెద్ద బతుకమ్మతో పాటు మరో చిన్న బతుకమ్మను కూడా పేర్చటం సంప్రదాయం. సాయంత్రం వేళ కొత్త బట్టలు ధరించిన మహిళలు, పిల్లలు సమూహాలుగా చెరువుల వద్దకు చేరి వృత్తాకారంలో నిలబడి చప్పట్లు, గొబ్బి, కోలాటం.. ఆట పాటలతో పూజిస్తారు. ఆట-పాటలు పూర్తయిన తరువాత తాము తీసుకొచ్చిన నైవేద్యాలను సమర్పించి అనంతరం బతుకమ్మను జలాశయాలలో నిమజ్జనం చేస్తారు. తమతో పాటు తీసుకొచ్చిన నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. బతుకమ్మను ఆడే సమయంలో ఆలపించే పాటల్లో పంటలపై ఆశీర్వచనాలు, అన్నదమ్ములపై సోదరీ భావం, దేవతలపై భక్తి, సామాజిక సమస్యలపై చైతన్యం ప్రతిబింబిస్తాయి.

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ వంటి గీతాలు, ‘రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయలవాడే అమ్మా’ వంటి పాటలు భక్తి భావాన్ని ప్రదర్శిస్తాయి. ‘జనకు జనకునింటి ఉయ్యాలో’ వంటి గీతాలు సీతాదేవిని స్మరిస్తాయి. ‘కలవారి కోడలు కలికి కామాక్షి’ వంటి పాటలు సామాజిక సమస్యలను ప్రస్తావిస్తాయి. చారిత్రకంగా కూడా బతుకమ్మ పండుగ ప్రాధాన్యం గడించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 2016లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద లక్షలాది మహిళలు బతుకమ్మ ఆడగా రాష్ట్ర సంస్కృతి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించింది.

2017లో హైదరాబాద్లో జరిగిన బతుకమ్మ ఉత్సవం ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్న ‘ఫోక్ డాన్స్’గా నమోదైంది. 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో బతుకమ్మను చేర్చాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిఫారసు చేయగా ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

 Bathukamma
Bathukamma

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, ఇంగ్లాండ్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. 2023లో డల్లాస్లో జరిగిన బతుకమ్మ ఉత్సవంలో 25 వేలమంది మహిళలు పాల్గొన్నారు. 2024లో తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల మంది మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మలో పాల్గొన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమిష్టి ఉత్సవం మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. ప్రకృతి ఆరాధన, కుటుంబ బంధాల బలోపేతం, సామాజిక ఐక్యత, సాంప్రదాయ వారసత్వ పరిరక్షణ బతుకమ్మ ద్వారా బలపడుతున్నాయి. బతుకమ్మ కేవలం పూల ఆట మాత్రమే కాదు.. అది తెలంగాణ ఆడవారి ఆత్మగౌరవం, శక్తి స్వరూపిణి స్మరణ, సాంస్కృతిక వారసత్వానికి సజీవ రూపం.

Read also: hindi.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870