हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Telugu News: Stock Market: ట్రంప్ కొత్త సుంకాల దెబ్బ.. కుదేలైయిన మార్కెట్లు

Sushmitha
Telugu News: Stock Market: ట్రంప్ కొత్త సుంకాల దెబ్బ.. కుదేలైయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.(trading) ఈరోజు మార్కెట్లు కుదేలవడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఫార్మా దిగుమతులపై ఏకంగా 100 శాతం మేర దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఊహించని నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రంప్ సుంకాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలు నష్టపోయేందుకు కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించి రూ.88.68 వద్ద ట్రేడవుతోంది.

 Trump: భారత ఫార్మారంగంపై ట్రంప్ భారీ దెబ్బ

Stock Market

ఫార్మాతో పాటు ఇతర ఉత్పత్తులపై సుంకాలు

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బ్రాండెడ్, పేటెంటెడ్ మందులపై 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ పరికరాలపై 50 శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 1 నుంచే ఈ టారిఫ్స్ అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికానే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. 2023-24లో భారతదేశం అమెరికాకు మొత్తం 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

మార్కెట్‌లో పతనమైన షేర్లు, లాభపడిన రంగాలు

ఫార్మా రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆ రంగంలోని కంపెనీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా వంటి ఫార్మా రంగంలోని షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగంలోని షేర్లైన ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, విప్రో వంటివి కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్ల నష్టంతో 80,753 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు కోల్పోయి 24,760 వద్ద ట్రేడవుతోంది. అయితే, లార్సెన్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ వంటి ఆటో రంగంలోని కొన్ని షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండటం గమనార్హం.

స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి కారణం ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఫార్మా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడమే ప్రధాన కారణం.

కొత్త సుంకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?

అక్టోబర్ 1 నుంచే ఈ టారిఫ్స్ అమలులోకి వస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870