हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Tenders for Liquor Shops : మద్యం షాపుల టెండర్లు

Sudheer
Tenders for Liquor Shops : మద్యం షాపుల టెండర్లు

తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుల (Liquor Shops) కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కొత్తగా షాపులు నిర్వహించాలనుకునే వ్యాపారులు టెండర్లలో పాల్గొనాలంటే ముందుగా రూ.3 లక్షల ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. ఈ మొత్తం తిరిగి చెల్లించబడదని స్పష్టంచేశారు. వచ్చే అక్టోబర్ 23న డ్రా నిర్వహించి అర్హులైన దరఖాస్తుదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో వ్యాపారులు భారీగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

wine shops telangana

ఈసారి లైసెన్స్ ఫీజులను జనాభా ఆధారంగా ఆరు శ్లాబులుగా విభజించారు. 5వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపుల లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 5వేల నుంచి 50వేల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60 లక్షలు వసూలు చేయనున్నారు. ఇక ఒక లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్న జనాభా గల నగరాల్లో రూ.85 లక్షలు, 20 లక్షలకు పైబడిన మెట్రో నగరాల్లో రూ.1.10 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయాల వల్ల పట్టణాలు, గ్రామాల వారీగా లైసెన్స్ ఖర్చులు పెరిగి పోటీ మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. చిన్న పట్టణాల్లో షాపు ప్రారంభించదలచిన వ్యాపారులు తక్కువ ఖర్చుతో అవకాశం పొందగలిగినా, పెద్ద నగరాల్లో మాత్రం భారీ మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. మరోవైపు, ఎక్సైజ్ శాఖ ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఈ విధంగా లైసెన్స్ విధానం పారదర్శకంగా, సిస్టమాటిక్‌గా ఉండేలా ప్రభుత్వం ముందడుగు వేసిందని అధికారులు చెబుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870