Trump : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UN) కార్యాలయంలో జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడు సందర్భాల్లో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇవి యాదృచ్చికంగా జరగలేదు, (Trump UN) ఎవరో కుట్ర చేయడం వల్ల జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరగాలని ట్రంప్ సీరియస్‌గా అన్నారు.
సభకు రానంతక ముందు ట్రంప్ మరియు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఎస్కలేటర్ ఎక్కగా అది ఎస్కలేటర్ ఆగిపోయింది. ఇంతవరకు బాగా పనిచేస్తున్న ఎస్కలేటర్ వారిద్దరిని కొన్ని క్షణాలపాటు అయోమయానికి గురిచేసింది. చివరగా, మెట్లను ఉపయోగించి వేదికకు చేరుకున్నారు.

Read also : కొన్ని జిల్లాల్లో భారీ వర్షం, హైదరాబాద్ ఎండగాలి
ప్రసంగ సమయంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. టెలిప్రాంప్టర్ పని చేయకపోవడం, సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల ప్రసంగం పూర్తిగా వినిపించలేదు. ట్రంప్ మాట్లాడుతూ ఉన్న సమయంలో, తన భార్య కూడా ఏమీ వినలేదని చెప్పింది.
ఈ మూడు ఘటనలపై దర్యాప్తు కోసం ట్రంప్ సీక్రెట్ సర్వీసెస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలపై ట్రంప్ “కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదు, ప్రమాదకరమైనవి కూడా” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఎస్కలేటర్ సమస్యపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని, అన్ని ఫుటేజీలను సేకరించి సమగ్ర దర్యాప్తు జరగాలని చెప్పినట్లు తెలిపారు. వైట్ హౌస్ కూడా దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.
Read also :