భారత రక్షణశాఖ మరో పురోగతి సాధించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)(Defence_Research_and_Development_Organisation) ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. ఈ క్షిపణిని రైలు నుంచే ప్రయోగించడం విశేషం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. భారత్ రైలు ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి మీడియం రేంజ్ అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిందని ఆయన పేర్కొన్నారు.
Bihar elections -ఎత్తుకు పైఎత్తులతో నేతల ఎదురీత

అగ్ని ప్రైమ్ మిస్సైల్ సామర్థ్యం
ఈ క్షిపణికి దాదాపు 2 వేల కిలోమీటర్ల పరిధి సామార్థ్యం ఉంది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ఇలా క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన DRDO, స్ట్రాటజిక్ ఫోర్సెస్(Strategic Forces) కమాండ్ (SFC), సాయుధ దళాలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. అగ్ని ప్రైమ్ మిస్సైల్ 2 వేల కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లి శత్రువులపై దాడులు చేయగలదు. అలాగే ఇది రైలు నెట్‌వర్క్ వెంట ప్రయాణించగలదు, చాలా తక్కువ సమయంలోనే దేశంలో ఏ సరిహద్దుకైనా వేగంగా చేరుకోగలదు.
క్షిపణి లక్షణాలు
అగ్ని ప్రైమ్ మిస్సైల్‌కు(prime missile) శత్రువుల రాడర్ నుంచి తప్పించుకునే సామార్థ్యం కూడా ఉంది. ఈ మిస్సైల్‌లో నావిగేషన్ సిస్టమ్ అత్యంత అధునాతనంగా అమర్చారు. దీనివల్ల శత్రు స్థావరాలను ఇది అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలదు.
అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను ఏ ప్లాట్‌ఫారమ్‌పై నుంచి ప్రయోగించారు?
అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించారు.
ఈ క్షిపణి పరిధి ఎంత?
అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరిధి దాదాపు 2,000 కిలోమీటర్లు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: