తెలంగాణ సచివాలయం (Secretariat)ఎదుట అంగన్వాడీ టీచర్లు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను అధికారులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో వారు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసన కార్యక్రమం ఒక్కసారిగా రాజకీయం తాలూకూ విమర్శలకు వేదికైంది.
ఉచిత బస్సుల్లో వచ్చి.. అదే ప్రభుత్వంపై నినాదాలు!
రెవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సేవలలోనే అంగన్వాడీ టీచర్లు సచివాలయానికి చేరుకోవడం విశేషం. అందులోనే వారు తిరిగి రెవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై గళమెత్తడం హాట్ టాపిక్ అయింది. ఈ వ్యతిరేకతలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీసుల హస్తక్షేపం – ఉచిత బస్సులోనే స్టేషన్కు!
ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిన పోలీసులు, ఉచిత బస్సుల్లోనే వారిని పోలీస్టేషన్లకు తరలించారు. ఇది చూసిన ప్రజల మధ్య సెటైరికల్ వ్యాఖ్యలు వినిపించాయి. “ఉచిత బస్సు (Free bus)ప్రయోజనం ఇది కూడా?” అన్న చర్చలు చెలరేగాయి.
ప్రీ-ప్రైమరీ విధానంపై తీవ్ర వ్యతిరేకత
ఇక మరోవైపు, ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రీ-ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అంగన్వాడీ కార్యకర్తలు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసాన్ని ముట్టడించారు. ప్రభుత్వ విద్యా విధానాలు తమకు నష్టం చేస్తున్నాయని ఆరోపించారు.”తమ డిమాండ్లు న్యాయసమ్మతమైనవే అయినా, అవి వినిపించక ముందే అరెస్టులు చేయడమా?” అంటూ అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వారు తీవ్రమైన విమర్శలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: