हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Bigg Boss 9: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్ తో.. ప్రమాద జోన్‍లోకి ఆ కంటెస్టెంట్..

Anusha
Latest News: Bigg Boss 9: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్ తో.. ప్రమాద జోన్‍లోకి ఆ కంటెస్టెంట్..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss 9)  ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు ముగియడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు మరింత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా ఆడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మూడో ఎలిమినేషన్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రతి ఒక్కరూ తమ స్థానం సురక్షితం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఇమ్యూనిటీ టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో బిగ్‌బాస్, ముగ్గురు కంటెస్టెంట్లకు ప్రత్యేకంగా ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురు – దమ్ము శ్రీజ, రీతూ చౌదరి, ఫ్లోరా సైని. “గురి తప్పదు” అనే పేరు గల ఈ గేమ్‌లో వారిని పోటీకి దింపాడు. టాస్క్ స్వభావం, ఆడే తీరు, వ్యూహం – అన్నీ మిక్స్ కావడంతో హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Bigg Boss 9: చికెన్ కోసం తనూజ సీక్రెట్స్ రివీల్ చేసిన రీతూ

గేమ్ మొదలైన వెంటనే రీతూ చౌదరి తన దూకుడు ప్రదర్శించింది. వేగం, చాకచక్యం, శక్తి – మూడు సమన్వయంతో ఆమె గేమ్‌ను ముందుకు తీసుకెళ్లింది. అయితే శ్రీజ మాత్రం తెలివి, వ్యూహంతో రీతూకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ సన్నివేశం చూస్తూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెట్టారు. ఆడే వేళ శ్రీజ ఒత్తిడికి గురై కాసేపు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లను కూడా కాసేపు కలచివేసింది.

ఇక ఫ్లోరా సైని మాత్రం సైలెంట్‌గా, ప్లాన్ ప్రకారం తన ఆటను ఆడుతూ వెళ్లింది. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చివరికి టాస్క్‌ను గెలుచుకుంది. గేమ్‌లో చివరికి ఎవరైతే ముందుగా తమకు కేటాయించిన బాస్కెట్‌లో మూడు బాల్స్ వేస్తారో వారే విజేతగా నిలవాలి అనే నియమం బిగ్‌బాస్ స్పష్టంగా చెప్పాడు. ఈ నిబంధన ప్రకారం ఫ్లోరా ముందంజ వేసి ఇమ్యూనిటీ టాస్క్ విజేతగా నిలిచింది.

Bigg Boss 9
Bigg Boss 9

బాస్కెట్ లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేత

గురితప్పకు అనే టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్.. ఇందులో కేజ్ లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ ను తీసుకుని బయట నేల మీద ఉన్న తమ బాక్స్ లో ఉంచాలి.. ఎవరైతే ముందుగా తమకు కేటాయించిన బాస్కెట్ లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవన్ పొందుతారు అని చెప్పాడు.

ఈ గేమ్ స్టార్ట్ కాగానే రీతూ (Ritu)కు, శ్రీజ మధ్యే అసలు పోటి నడిచింది. శ్రీజ బాల్ అందుకున్న ప్రతిసారి రీతూ అడ్డుపడింది. శ్రీజను బయటకు వెళ్లకుండా బలంగా ఆపేసింది. శ్రీజ పైకి ఎక్కి.. మెడ పట్టుకుని డిఫెండ్ చేసింది. ఆ సమయంలో అటు హౌస్మేట్స్, ఇటు అడియన్స్ కు సైతం టెన్షన్ అనిపించింది. దీంతో సంజన, ప్రియ రీతూ జాగ్రత్త అంటూ అరిచారు.

ఫ్లోరా బాల్స్ అన్నింటిని తన బాక్స్ లో వేసుకుంది

దీంతో ప్రియాకు కౌంటర్ ఇచ్చింది రీతూ. అయితే ప్రతిసారి తనను బలంగా ఆపుతున్న రీతూను ఈసారి తెలివితో దెబ్బకొట్టింది శ్రీజ. ఎలాగూ తనని బాల్ పట్టుకుని బయటకు వెళ్లడానికి రీతు వదలదు అని అర్థం చేసుకున్న శ్రీజ (Srija).. బాల్ పడిన వెంటనే రీతూనే ఆపేసి బాల్ ఫ్లోరా చేతికి వెళ్లేలా చేసింది. దీంతో ఫ్లోరా బాల్స్ అన్నింటిని తన బాక్స్ లో వేసుకుంది.దీంతో చిరాకేసిన రీతూ.. సరిగ్గా గేమ్ ఆడు.. నువ్వు గెలవాలని ఆడాలి కానీ ఇదేంటీ అంటూ డైలాగ్ కొట్టింది రీతూ.

దీంతో నా గేమ్ నా ఇష్టం.. మొన్న నీ బాల్స్ అన్నీ రాముకు ఇచ్చేసి నువ్వు తనకు సపోర్ట్ చేయలేదా.. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా.. నా గేమ్ నా ఇష్టం వచ్చినట్లు ఆడతా అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యింది శ్రీజ. చివరకు ఫ్లోరా బాక్స్ లో 3, రీతూ దగ్గర 4, శ్రీజ దగ్గర ఒక బాల్ ఉన్నాయి. రూల్ ప్రకారం తమ బాక్స్ లో మూడు బంతులను తమ బాస్కెట్లో వేయాలి.

ముందుగా వేసిన వాళ్లే విన్నర్

అలా ముందుగా వేసిన వాళ్లే విన్నర్ అని ప్రకటించడంతో ముందుగా రీతూ ఒక బాల్ వేసింది. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా బాల్స్ పడలేదు. కానీ ఫ్లోరా (Flora) మాత్రం వెంట వెంటనే బాల్స్ వేసింది. దీంతో ఈ టాస్కులో ఫ్లోరా గెలిచింది. దీంతో ఈవారం నామినేషన్స్ నుంచి ఫ్లోరా సేవ్ అయ్యింది. మరోవైపు గేమ్ ఒడిపోవడంతో రీతూ ఏడుపు స్టార్ట్ చేసింది.

వెంటనే తనూజ (Tanuja) వెళ్లి ఓదార్చింది. ఆ తర్వాత డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, భరణి అందరూ రీతూను ఓదార్చారు. అయితే ఫ్లోరా గెలవడంతో ఇప్పుడు నామినేషన్లలో కేవలం ఐదుగురే ఉన్నారు. ప్రియ, రాము, రీతూ, పవన్ కళ్యాణ్, హరీష్ మాత్రమే ఉన్నారు. వీరిలో ప్రియ, రీతూ డేంజర్ జోన్ లో ఉండగా.. ఈసారి ప్రియ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870