హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా హైదరాబాద్‌కు గంజాయి సరఫరా తగ్గడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గంజాయి సరఫరాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్మగ్లర్లను కట్టడి చేయడంతో పాటు, దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు ఆయుధాలను అందించేందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఆయుధాలు ఎక్సైజ్ సిబ్బందికి అందుబాటులోకి వస్తాయి.

పీడీ యాక్ట్‌తో స్మగ్లర్ల భరతం, భారీగా గంజాయి పట్టివేత
గత మూడున్నర నెలల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లు మంచి ఫలితాలను ఇచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్(Andhra-Orissa Border) (AOB) నుంచి గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒరిస్సాలోని గంజాయి సాగు, బడా వ్యాపారులతో సంబంధాలున్న లఖాన్ సింగ్ అనే వ్యక్తిపై హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడీ (నివారక నిర్బంధ) యాక్ట్ విధించారు. ఎనిమిది నెలల్లో మూడుసార్లు పెద్ద మొత్తంలో గంజాయితో పట్టుబడిన లఖాన్ సింగ్‌పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్(Excise Enforcement) డైరెక్టర్ సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. మరో గంజాయి డాన్ అంగూర్ భాయ్‌పై కూడా పీడీ యాక్ట్ విధించడంతో ఆమె ప్రస్తుతం జైలులో ఉంది. ఇటీవల ఏవోబీ నుంచి రెండు కార్లలో 122.85 కిలోల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డీటీఎఫ్ టీమ్ చాకచక్యంగా పట్టుకుంది. స్మగ్లర్లు కారు డిక్కీలోనూ, కారు బాడీ కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్నారని అధికారులు తెలిపారు.
గంజాయి సరఫరాను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటి?
ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లకు ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గంజాయి ప్రధానంగా ఏ ప్రాంతం నుంచి సరఫరా అవుతోంది?
ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ (ఏవోబీ) నుంచి గంజాయి సరఫరా అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: