హౌజింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ MD Gautam హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్దిదారులకు రూ. 1612.37 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. Indiramma Update అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదనీ, ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, ఇంతవరకు సుమారు ఒక లక్షా యాభై వేలకు పైగా చెల్లింపులు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణపు పనుల దశలను బట్టి లబ్ధిదారులకు విడతల వారీగా మొత్తం 5 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు.

Indiramma Update
లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమ కానిపక్షంలో, వారు తమ అక్కౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్ ను ఖాతాకు అనుసంధానించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వేల పైచిలుకు గ్రామాలు, సుమారు 4 వేల మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయని, అనేక ప్రాంతాల్లో ప్రతినిత్యం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. Indiramma Update పూర్తి పారదర్శకమైన విధానంతో, అధునాతన టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 17 వేల ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల నిమిత్తం రూ.188.35 కోట్లను లబ్దిదారులకు విడుదల చేసినట్లు తెలిపారు. ఇంతవరక బేస్ మెంటాయి రూ. 1210.76 కోట్లు (1,21,076 ఇండ్లకు), అదేవిధంగా రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) రూ.252.64 కోట్లు (25, 264 ఇండ్లకు) రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి): రూ. 155.44 కోట్లు (7,772 ఇండ్లకు) ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు ఆధార్ నెంబరు ఆధారంగా నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటివరకు ఎంత మొత్తం నిధులు విడుదలయ్యాయి?
రూ.1612.37 కోట్లు లబ్ధిదారులకు విడుదలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి?
సుమారు 2.12 లక్షల ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: