దంతెవాడ జిల్లాలో 71 మంది లొంగుబాటు
వారిలో 21 మంది మహిళలు
చర్ల (ఖమ్మం) : గడిచిన నాలుగు దశాబ్దాలుగా దండకారణ్యం ప్రాంతంలో సామంతర పాలన నడిపిన మావోయిస్టు (Maoists) లకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పార్టీకు దిశానిర్ధేశం చేసే కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మృతితో పార్టీలో నాయకత్వలేమి కనిపించింది. అనంతరంజరిగిన వివిధ ఎన్కౌంటర్లో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందగా… మరో సభ్యురాలు లొంగిపోయారు.
పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేధాలతో సతమతమవుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ (Maoist Party) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటు వివరాలను బస్తర్ రేంజ్ ఐజి పి.సుందర్రాజ్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన లొన్వర్రాట్టు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని అన్నారు.

స్వయం ఉపాధి అవకాశాలు వంటివి
మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న 71 మంది లొంగిపోయారని, వీరిలో 21 మంద మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస విధానం (Rehabilitation policy) ప్రకారం తక్షణ సహాయంగా రూ. 50వేల నగదును అందజేస్తామని, నైపుణ్య, అభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూమి, స్వయం ఉపాధి అవకాశాలు (Self employment opportunities) వంటివి వీరికి లభిస్తాయని అన్నారు. నేటి వరకు ఈ కార్యక్రమం ద్వారా (లోన్వర్రాట్టు) ప్రచారం ద్వారా 1113మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 297 మందిపై రివార్డు కలిగి ఉన్నారని,
దంతెవాడ జిల్లాలోనే గత 19 నెలల్లో 461 మంది నక్సలైట్లు లొంగిపోగా వీరిలో 129 మంది రివార్డు కలిగి ఉన్నారని అన్నారు. హింస, వలన సాధించేది ఏమీ లేదని, అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మావోలందరూ తమ కుటుంబాలు, సమాజం కోసం హింసా మార్గాన్ని విడిచి శాంతి, అభివృద్ధి వైపు పయనించాలని అన్నారు. ఈ సమావేశంలో దంతెవాడ రేంజ్ డిఐజి కమలోచన్ కశ్యప్, సిఆర్పిఎఫ్ డిఐజి (ఆపరేషన్స్) రాకేష్రెచౌదరి, దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: