తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఓజీ ఫీవర్ పూర్తిగా అలుముకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. ట్రైలర్, పాటలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వంటివి ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడంతో, అభిమానుల్లో ఉద్వేగం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
(నేటి) బుధవారం రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ పడనుండగా, గురువారం నుంచి పూర్తి స్థాయిలో ‘ఓజీ’ (OG Movie) సాధారణ ప్రదర్శనలు మొదలుకానున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటిలాగే షోలు, బెనిఫిట్ షోలు, ఫ్యాన్ సెలబ్రేషన్స్ కోసం పెద్దఎత్తున సిద్ధమవుతున్నారు. సినిమా కంటెంట్ పై కురిపిస్తున్న అంచనాలు, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రానున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి.
టికెట్ ధరల పెంపు అనుమతిపై స్టే
అయితే, సినిమా విడుదల ముందు ఓజీ చిత్రానికి ఒక చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఓజీ టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు (Telangana High Court) స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టికెట్ ధరల పెంపు అనుమతిపై స్టే విధించింది. అంటే, బెనిఫిట్ షోలు సహా ఎక్కడా టికెట్ ధరలు పెంచొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

బెనిఫిట్ షోలకు రూ.800 వరకు పెంచుకునేందుకు అనుమతినివ్వడంతో పాటు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్లలో రూ.100లతో పాటు మల్టీప్లెక్స్ (Multiplex) లలో రూ.150 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను హైకోర్టు తాజాగా రద్దు చేసింది.ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలువురు స్టార్స్ నటించారు
కాగా.. సాహో డైరెక్టర్ సుజిత్ (Sujith) తెరకెక్కించిన ఓజీ సినిమాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు స్టార్స్ నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.. అలాగే నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: