అవకాశం దొరికితే చాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తనదైనశైలిలో విమర్శిస్తుంటారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేస్తున్నదని, దీనివల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నదని ట్రంప్ విమర్శించిన విధానం మనకు తెలిసిందే. అంతేకాక భారత్ రష్యాకు ఆర్థిక సాయం చేస్తున్నదని దీంతో యుద్ధం కొనసాగుతున్నదని ట్రంప్ మరోసారి భారత్ పై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం (Financial assistance) చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ మాట్లాడుతూ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తమ పక్షానే ఉందని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యమని జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు.

భారత్, చైనాలే నిధులు ఇస్తున్నాయి: ట్రంప్
కానీ ఐక్యరాజ్యసమితి 80వ సెషన్ లో ట్రంప్ ప్రసంగిస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలే ప్రధాన నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, రష్యా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. అయితే, జెలెన్ స్కీ ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించారు. ‘భారత్ ఎక్కువగా మా పక్షానే ఉందని నేను భావిస్తున్నాను. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ల విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
ట్రంప్ వాటిని పరిష్కరించగలరని అనుకుంటున్నాను అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. భారత్ ను పశ్చిమ దేశాల నుండి దూరం చేసుకోకుండా, వారితో బలమైన, సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని యూరోపియన్ దేశాలకు(European countries) కూడా ఆయన సూచించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్ పలుమార్లు కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇద్దరితోనూ టెలిఫోన్ లో మాట్లాడి, యుద్ధాన్ని ఆపాలని కోరారు. అంతేకాదు భారత్ ఉక్రెయిన్ కు మానవతా సహాయాన్ని కూడా అందించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-ఉక్రెయిన్ సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని జెలెన్ స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ భారత్‌పై చేసిన ఆరోపణలు ఏమిటి?
భారత్ రష్యా నుంచి అధిక చమురు కొనుగోలు చేస్తూ, రష్యా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తోందని, దీంతో యుద్ధం కొనసాగుతోందని ట్రంప్ ఆరోపించారు.
జెలెన్ స్కీ ఈ ఆరోపణలకు ఎలా స్పందించారు?
భారత్ ఎక్కువగా ఉక్రెయిన్ పక్షానే ఉందని, సంబంధాలను బలోపేతం చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: