TG: తన కూతురి పట్ల ఎందుకు అసభ్యంగా ప్రవర్తించారని నిలదీసినందుకు ఆమె తండ్రిని యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మైనర్ బాలికను స్థానిక హోటల్లో పనిచేసే యువకుడు వేధిస్తున్నాడు. దీంతో ఆమె తండ్రి అతడిని బెదిరించాడు. కోపంతో ఆ యువకుడు.. సోదరుడు, ఫ్రెండ్స్‌లో కలిసి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనార్ధన్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టారు.

దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనార్ధన్ అనే వ్యక్తిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. జనార్ధన్‌కు కూడా గాయాలు కావడంతో ఆయనను వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చిన్నారులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో మరింత కలకలం రేగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సమాచారం.
Read More : 5 నెలల గర్భిణీ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..