మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) అలియాస్ భూపతి, ఆయుధాలు వీడుతున్నట్లు, కాల్పుల విరమణ చేస్తున్నట్లు చేసిన సంచలన ప్రకటనపై పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూపతి ప్రకటన ఆయన వ్యక్తిగతమైనదని ఇప్పటికే తెలంగాణ విభాగం అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేయగా, తాజాగా కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసి భూపతిని(Bhupati) ‘ద్రోహి’గా పేర్కొంది. భూపతి చేసిన ప్రకటన ఏకపక్షంగా, మావోయిస్టు పార్టీకి తీరని ద్రోహం చేసే విధంగా ఉందని కమిటీ విమర్శించింది.

ఆయుధాలు అప్పగించాలని ఆదేశం
మావోయిస్టు పార్టీపై భూపతి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని కేంద్ర కమిటీ ఆక్షేపించింది. భూపతి చేసిన ప్రకటనను ఖండించడంతో పాటు, ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. ఆయన లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర కమిటీ ఆరోపించింది. భూపతి వెంటనే ఆయుధాలు అప్పగించకుంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(Guerrilla Army) (PGA) వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. భూపతి, దివంగత మావోయిస్టు పార్టీ నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి సోదరుడు కావడం గమనార్హం.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది?
కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై.
పార్టీ భూపతికి ఏమి అప్పగించాలని ఆదేశించింది?
ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: