ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు. “7 నెలల్లోనే నేను 7 యుద్ధాలను ఆపాను. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడు, ఏ ప్రధానమంత్రి అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇది అసలైన ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పని, కానీ నేను చేశాను” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో ప్రపంచ నేతల దృష్టిని ఆకర్షించారు.
భారత్, చైనా పై ఆరోపణలు
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి భారత్, చైనా వంటి దేశాలే ప్రధానంగా నిధులు సమకూరుస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు యుద్ధాన్ని మరింత కొనసాగించేలా చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ శాంతి భద్రతలపై ప్రభావం చూపే ఈ అంశంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

నాటో దేశాల ప్రస్తావన
అంతేకాకుండా నాటో సభ్యదేశాలూ రష్యా ఎనర్జీ వనరులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందని ట్రంప్ తెలిపారు. ఈ వ్యవహారం తనకు అస్సలు నచ్చలేదని, ఇది రష్యాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లేనని విమర్శించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలు యుద్ధం నిలిపివేయడంలో కీలక పాత్ర పోషించాయని, ఇతర దేశాలు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.