हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : అడ కత్తెరలో ‘ఆక్వాసాగు’!

Sudha

ఆక్వాకు ఆయువుపట్టుగా ఉన్న తీర ప్రాంత జీవనో పాధిని అమెరికా దెబ్బకొడ్తోంది. తీరప్రాంతమేకాదు వివిధ జిల్లాలో రొయ్యల చెరువుల పెంపకందార్ల జీవన విధానం ఒక్కసారిగా కుదేలైపోయింది. భారతదేశంలో బలీయంగా ఉన్న రంగాలన్నిటినీ అమెరికా కొత్త సుంకాలు (duties) దెబ్బతీస్తున్నాయి. మళ్లీ తాజాగా ఆక్వా సుంకాలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇది మరో కోలుకోలేని దెబ్బ. భారత దేశంలో విరివిగా లభించే వివిధ ఉత్పత్తులే కాకుండా మానవ వనరులపై ట్రంప్ మార్కుసుంకాలు, ఫీజుల పెంపు ఆయా రంగాలను, రంగాల నిపుణులను ఊపిరి సల్ప కుండా చేస్తోంది. ఈరెండు రంగాలు విశేషప్రతిభ కలిగిన వారిలో నిండి ఉన్నందున, ఉత్తమ ఉత్పత్తులు కారణంగా భారతదేశాన్ని సర్వోతోముఖాభివృద్ధికి దోహదపరుస్తోంది. కానీ ట్రంప్్వస్తున్న సుంకాలు, ఫీజులు మరింత బాధపెడ్తున్నాయి. తమతో భారతదేశ వాణిజ్య ఒడంబడికలు చేసుకోవడంలో జాప్యం వహిస్తోందన్న సాకుతో ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికా షరతులు భారతీయ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తుందని, భారతీయ రైతు ఉత్పత్తులను కష్టాలు పాల్జేస్తుందనే అభిప్రాయం తోటే తాము ట్రంప్తో ఒప్పందాన్ని కాదనుకుంటున్నామని ప్రధాని మోడీ ఇంతక్రితమే తేటతెల్లం చేశారు. కానీ ట్రంప్ భారతదేశం మీద ఒత్తిడి పెంచుతున్నారు. తాజా పరిస్థితులను విశ్లేషించుకుంటే భారత్పై ట్రంప్ సుంకాల దాడి పెరిగిపోతోంది. దేశానికి రెండుకళ్లుగా ఉన్న మానవ వనరుల, వ్యవసాయరంగాల ఆధారిత జీవన విధానాలను సుంకాల సూదితో పొడవాలనుకోవడం ఏ విధమైన వాణిజ్య నీతో అర్థంకాని పరిస్థితిలో పాలకులు తలపట్టుకుని వేచిచూస్తున్నారు. భారతదేశాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆక్వారంగం(Aquaculture)పై విధించిన సుంకాల ప్రభావంతో ఆ రంగం బాగా కుంచించుకుపోయింది. ప్రస్తుతానికి ఆక్వా బహుళ ఉత్పత్తులపై 25 శాతం అదనపు టారిఫ్ విధించింది. కొన్ని ఉత్పత్తులపై 27 శాతం వరకు ఉంటుంది. ప్రధానం గా ఆక్వారంగంపై (Aquaculture) మంచి ఆదాయం రాబట్టుకుంటూ జీవ నోపాధి సాధించుకుంటున్న పెంపకందారులు ఎడాపెడా రెండు రకాల నష్టం చవి చూశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే 25 వేల కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి. తొలినాటి సుంకాల వడ్డనకే 50శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యా యి. అప్పటికే పంపిన 2వేల కంటైనర్ల రొయ్యల ఎగుమ తులపై రూ. 600 కోట్లమేర అధిక సుంకం చెల్లించుకో వాల్సి వచ్చింది. ఆ మేరకు తీవ్రనష్టాన్ని ఎగుమతిదారు లు నష్టపోవాల్సి వచ్చింది. దిగుబడులు బాగా పెరిగినా ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. స్థానిక వినియోగ దారులకు ధర పెరిగిపోవడంతో ఎన్నో ఉత్పత్తులు కుళ్లిపోయాయి. రెండోప్రత్యామ్నాయం లేక నష్టం భరించాల్సి వచ్చింది. స్థానిక ప్రభుత్వాలు రొయ్యలు, చేపల పెంపకందారులకు తాత్కాలిక ఉపశమనం కోసం విద్యుత్ ధరల మినహాయింపు వంటి సౌకర్యాలు కల్పించినా రొయ్యల రైతుకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆక్వాకల్చర్ రంగానికి కేంద్రం తక్షణ ఉపశమనమేదీ కల్పించే పరిస్థితి లేదు. మన ఉత్పత్తులను వేరే దేశాలకు పంపే పరిస్థితి కూడా కానరావడం లేదు. ఈ రీత్యా రొయ్యల పెంపకం చేసే కౌలుదార్లు చెర్వులను వదిలివెళ్లిపోతున్నారు. దేశీయ సముద్ర ఆహార వినియోగాన్ని పెంచడం కూడా సాధ్యం కాని రీతిలో ఆక్వా పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది. దేశంలోని రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం, సముద్రఆహార ఎగుమతుల్లో 34 శాతం ఆంధ్రప్రదేశ్ వాటా లోబడి రూ..21,246 కోట్లు ఉంటుంది. ఆక్వాపై జీవనోపాధి కల్పించుకునే కుటుంబాలు 25 లక్షలు కాగా అనుబంధ రంగాలలో 30 లక్షల మంది ఉన్నారు. ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు రూ.100 కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయినా ఇవన్నీ ఆక్వా పెంపకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కాజాలదు. ఆక్వా రైతుల్ని ఆదుకునే దిశగా ఇంకా చెప్పుకోదగిన ఉపశమనాలు లభించనట్లే. అన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. రొయ్యల ఉత్పత్తులకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, స్వచ్ఛత కలిగిన చేపల మార్కెట్లు, ఆక్వా రవాణా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉంది. అమెరికా వంటి దేశాలు తమకు అవసరమున్నా తమకు దిగుబడి అయ్యే ఉత్పత్తులమీద సుంకాలు పెంచేసి ఒత్తిడి తెస్తున్న పరిస్థితుల్లో దేశీయ అవసరాల కోసం ఇక్కడి ఉత్పత్తులను పెంచుకునే దిశగా ఆలోచించాలి. చేపలు, రొయ్యల పెంపకందార్లకు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయలు టాప్ అప్లోన్గా సమకూర్చాలన్న ప్రతిపాద నలు కార్యరూపం దాల్చలేదు. ఎన్నున్నా పొరుగు దేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేయగల సౌకర్యం ఉంటేనే ‘ఆక్వా రంగం బతుకుతుంది. అమెరికాకు పంపే రొయ్య లపై అధిక డ్యూటీలు కారణంగా ఖర్చులు బోలెడు పెరిగి పోయి, స్వదేశీ వాణిజ్యంలో మోయలేని భారంగా మా రింది. అమెరికాతో పోల్చి ఊస్తే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న రొయ్యలు, రొయ్యల ఉత్పత్తులు పరిమాణంలో తక్కువే. ప్రధాన దిగుమతిదారు అమెరికాయే అయినందు న అమెరికా వాణిజ్యమే భారత్ కు లాభసాటి. కానీ ట్రంప్ ‘కొర్రీ’లుమనకు ఇబ్బందికరం. పైగా పోటీదేశాల ధరలు మనకన్నా తక్కువగా ఉండడంతో భారతీయ రొయ్యలకు మార్కెట్లో గిరాకీ తప్పింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే రొయ్యల ఉత్పత్తుల కన్నా వియత్నాం, ఈక్వడార్, ఇండోనేషియా ఉత్పత్తుల ధరలే తక్కువ. ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా 8నుంచి 10శాతం ఉత్పత్తులపై తగ్గుదలనమో దైంది. ఒడిషా, పశ్చిమబెంగాల్లోని రొయ్యల ఉత్పత్తిదా రులూ బాగా నష్టపోయారు. ఇప్పటికిప్పుడు అమెరికాతో ఒప్పందాలు కుదిరినా ఇతరత్రా ప్రభావాల వలన ‘ఆక్వా రంగం కోలుకోవడానికి చాలా కాలం పట్టేట్లు ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870