హెచ్-1బి పెంపు అమెరికాలో చాలారంగాలపై ప్రభావం చూపనుంది. తమ దేశంలో వారికి ఉద్యోగాలు రావాలని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దీని వలన ఇక్కడ ఉన్న కంపెనీలే ఇబ్బందులు పడనున్నాయి. దీంతో అన్ని వర్గాల నుంచి వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో ట్రంప్ సర్యారు వీసా ఫీజు పెంపుపై వెనక్కి తగ్గింది. తాజాగా వీసా రుసుము పెంపు నుంచి డాక్టర్లు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు విదేశీ వైద్యులే ఆధారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ డాక్టర్లే కీలకం
ఫిజీషియన్ వర్క్ ఫోర్స్(Physician Work Force) లో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లే కీలకమని చెబుతున్నారు. అందుకే అమెరికాలో ఆసుపత్రులు ఇతర దేశస్తులను ఎక్కువగా నియమించుకుంటారు. ఇప్పుడు వీసా ఫీజు పెంపు వలన డాక్టర్ల కొరత వస్తుంది. దాని వలన అక్కడి ఆరోగ్య సంస్థలే దెబ్బతింటాయి. మయో క్లినిక్, క్లీవ్ ల్యాండ్ క్లినిక్, సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రిసెర్చ్ హాస్పిటల్ వంటి ప్రముఖ సంస్థలకు విదేశీ డాక్టర్లే ఆధారమని నిపుణులు చెబుతున్నారు.
ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. వీసా ఫీజు పెంపు వల్ల వైద్య సిబ్బంది కొరత తీవ్రమవుతుందని ఆరోగ్య సంస్థలు(Health institutions) హెచ్చరించాయి. అందుకే ఈ విషయమై ట్రంప్ కార్యవర్గ పునరాలోచనలో ఉందని తెలుస్తోంది. డాక్టర్లను ఇందులో నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఆలోచిస్తోంది అని చెబుతున్నారు.
కంపెనీలకు పెద్ద లాస్
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం వల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్ కంపెనీలు హెచ్-1బి వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావొచ్చని తెలుస్తోంది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 1.23 లక్షల కోట్లకు ఎపైగానే. ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి వీసాపై తీసుకున్న ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలకు పెను భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ ఈ కథనం వెలువరించింది. ఈ నిర్ణయం అమెరికన్ స్టార్టప్ సంస్థలకు పెద్ద దెబ్బేనని స్టార్టప్ ఇంక్యుబేటర్వై కాంబినేటర్ సిఈవో గారీటాన్ తెలిపారు. విదేశాల్లో టెక్ హబ్లకు ఇదివరంగా మారిందంటే వ్యాఖ్యానించారు.
హెచ్-1బి వీసా మినహాయింపు ఎవరికి వర్తించనుంది?
ప్రధానంగా అమెరికాలో పనిచేయాలనుకునే వైద్యులకు ఈ మినహాయింపు వర్తించే అవకాశం ఉంది.
ఎందుకు ఈ ప్రతిపాదన వచ్చింది?
అమెరికాలో వైద్యుల కొరతను తీర్చడం, ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ యోచనపై చర్చ జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: