మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ (Narayanpur)జిల్లాలో ఘర్షణాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
వికల్ప్ హత్యపై అనుమానాలు
మృతుల్లో ఒకరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి చెందిన సీనియర్ నేత వికల్ప్ (Vikalp)కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన మరణవార్త మావోయిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో ధృవీకరణ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్
అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల చలనం ఉన్నట్లు విశ్వసించిన భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ చేపట్టాయి. ఆ సమయంలో మావోయిస్టులతో భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.
ఏకే-47 సహా ఆయుధాల స్వాధీనం
ఈ ఘటనపై బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సుందర్ రాజ్ స్పందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఓ ఏకే-47 రైఫిల్‌తో పాటు మరికొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.పార్టీ వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఓ కీలక నేతను కోల్పోవడం మావోయిస్టులకు పెద్ద షాక్‌గా మారింది. భద్రతా బలగాల ఆకస్మిక ఆపరేషన్, విలువైన సమాచారం ఆధారంగా మావోయిస్టులకు గట్టి దెబ్బగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: