हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

News telugu: Pawan Kalyan-పవన్ కల్యాణ్ ఓజీ ట్రైలర్‌పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం

Sharanya
News telugu: Pawan Kalyan-పవన్ కల్యాణ్ ఓజీ ట్రైలర్‌పై సాయి ధరమ్ తేజ్ ప్రశంసల వర్షం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న “ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్” ట్రైలర్‌ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో హలచల్ చేస్తోంది. ఈ ట్రైలర్ విడుదలతోనే ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఇందులో పవన్ స్టైల్, స్వాగ్, యాక్షన్ మేకింగ్ అన్నీ కలిపి అభిమానులని ఫిదా చేశాయి.

సాయి ధరమ్ తేజ్ ట్వీట్ వైరల్

మెగా మేనల్లుడు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)ఈ ట్రైలర్‌ పై స్పందిస్తూ ట్వీట్ చేసిన విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.”ఇన్నాళ్లూ మేం మిస్సయిన బెంగాల్ టైగర్ మళ్లీ వేటకు వచ్చింది” అంటూ ఆయన మామయ్య పవన్ కళ్యాణ్‌కి మెచ్చుల వర్షం కురిపించారు. ఈ ట్వీట్ అభిమానుల మధ్య పెను ఉత్సాహం నింపుతోంది.

చిత్ర బృందానికి స్పెషల్ శుభాకాంక్షలు

ట్రైలర్ కట్ చేసిన డైరెక్టర్ సుజీత్‌ను, మ్యూజిక్ అందించిన తమన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ సాయి ధరమ్ తేజ్ అన్నాడు:”నా కోరికను తీర్చిన సుజీత్ గారికి థ్యాంక్స్. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. తమన్ బీజీఎం ఫైర్‌స్టార్మ్ లా ఉంది” అని ప్రశంసించాడు.

పవన్ కళ్యాణ్ స్వాగ్‌కి అభిమానుల ఫిదా

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, “నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ ప్రతీ ఫ్రేమ్‌లో అదిరిపోయారు. ఆయన స్టైల్, స్వాగ్‌కి సరిపోలే హీరో ఇంకొకరు లేరు” అని చెప్పడం అభిమానుల్లో గర్వాన్ని కలిగించింది. ‘ఓజీ’ సినిమా విడుదలను పండుగలా సెలబ్రేట్ చేద్దాం అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ట్రైలర్‌కు క్రేజ్.. ప్రీమియర్స్‌కు భారీ డిమాండ్

ప్రస్తుతం ‘ఓజీ’ ట్రైలర్ (OG trailer)యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను షేక్ చేస్తోంది. సుజీత్ డైరెక్షన్, తమన్ బీజీఎం, పవన్ పవర్‌ప్యాక్డ్ లుక్ సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతకుముందే 24న పెయిడ్ ప్రీమియర్స్కి టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల టికెట్లు సేల్‌ అవుతూ హాట్ కేక్స్లా అమ్ముడవుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/movie-review-lights-camera-action/cinema/552243/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870