ఆసియా కప్ 2025(2025 Asia Cup)లో టీమిండియా, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ అద్భుతమైన క్రికెట్ థ్రిల్‌ని అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించటం ప్రత్యేక విశేషం. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేసాడు..
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బౌలర్లు షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్, అబ్రర్ అహ్మద్‌లను చీల్చి చెండాడాడు. ఈ మ్యాచ్‌పై మాట్లాడిన మిస్బ్ ఉల్ హక్.. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయినట్లు తెలిపాడు.’అతని నైపుణ్యాలు,అద్భుతం.
నెట్స్‌లో ఆడుతున్నట్లే చెలరేగాడు
పాకిస్థాన్‌పై తొలిసారి ఆడుతున్నప్పటికీ.. అతనిలో ఒత్తిడి, బెరుకు కనిపించలేదు. నెట్స్‌లో ఆడుతున్నట్లే చెలరేగాడు. తన జోన్‌లో ఉన్న బంతిని ఈజీగా బౌండరీ బయటకు తరలిస్తున్నాడు. అభిషేక్.. ప్రధాన బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాడు. అది ప్రత్యర్థి జట్టును దెబ్బతీస్తోంది.ఫాస్ట్ బౌలర్ (Fast bowler) ప్రధాన ఆయుధం హార్డ్ లెంగ్త్.

కానీ బంతి కాస్త వైడ్‌గా వెళ్తే బ్యాటర్ శిక్షిస్తాడు. షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) హార్డ్ లెంగ్త్‌లను అభిషేక్ శర్మ గౌరవించాడు. కానీ బంతి కాస్త షార్ట్ అయినా, పుల్ అయినా.. జరిగి మరి బౌండరీకి తరలించాడు.’అని మిస్బా ఉల్ హక్ (Misbah-ul-Haq) పేర్కొన్నాడు.ఈ టోర్నీలో పాకిస్థాన్ జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ తొలి బంతినే బౌండరీకి తరలించాడు.
ఫియర్‌లెస్ గేమ్‌కు షాహిన్ షా అఫ్రిది కూడా నోరెళ్ల బెట్టాడు
లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది వేసిన తొలి రెండు బంతులను 4, 6 బాదిన అభిషేక్ శర్మ తాజా మ్యాచ్‌లోనూ తొలి బంతిని సిక్సర్ బాదాడు.అతని ఫియర్‌లెస్ గేమ్‌కు షాహిన్ షా అఫ్రిది కూడా నోరెళ్ల బెట్టాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది. మరోవైపు భారత్ చేతిలో ఓడినా పాకిస్థాన్.. తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: