ఈ ఏడాది జూన్ నెలలో అహ్మదాబాద్ ప్రాంతంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన(Air India flight) ప్రమాదంపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికను అందించింది. ఈ నివేదికలో పైలెట్లు ఇంధన కంట్రోల్ స్విచ్చులు ఆఫ్ చేశారేమో అని నివేదికలో పేర్కొనడం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పైలెట్ల పనితీరును తప్పుపట్టడం బాధ్యతారాహిత్యమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

దర్యాపు పూర్తవకుండానే నిందించడం సరైంది కాదు
ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పట్ల అభిప్రాయం తెలియజయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ(Issuance of notices) చేసింది సుప్రీంకోర్టు. దర్యాప్తు పూర్తికాకుండా పూర్తిగా వారిదే తప్పు అని చెప్పడం ఏంటని సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇలా పైలెట్లే పొరపాటు చేసిందనే ఏకాభిప్రాయం రావడం సరైంది కాదని ఉన్నత ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ ప్రమాదంలో మొత్తం 229 మంది మరణించిన విషయం విధితమే. మెడికల్ హాస్టల్పై విమానం కుప్పకూలిపోవడం వల్ల 20 మంది మెడికోలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది?
సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి, భద్రతా ప్రమాణాల అమలు పై ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టాలు సంభవించాయి?
ప్రాణనష్టం, గాయాలు మరియు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: