మలయాళ సినీ పరిశ్రమలో సంచలన విజయం సాధించిన సూపర్ హీరో సినిమా ‘లోక’ ఓటీటీలో త్వరలోనే విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్(Rumors)పై స్పందించిన హీరో, నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పష్టత ఇచ్చారు. సినిమా ఇప్పట్లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ రిలీజ్ అవ్వబోమని తెలిపారు. ఆదివారం తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పోస్ట్ చేస్తూ, “లోక సినిమాకి సంబంధించిన తప్పుడు వార్తలను నమ్మకండి. అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి” అని పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్
వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం, మలయాళ పరిశ్రమలో తొలి మహిళా సూపర్ హీరో సినిమా కావడం విశేషం. థియేటర్లలో విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్(Box office) వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ₹275 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
కథానాయిక కల్యాణి ప్రియదర్శన్ ఆనందం
సినిమా విజయంపై నటి కల్యాణి ప్రియదర్శన్ గతంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ₹200 కోట్ల మార్క్ దాటిన సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, “ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు నిజంగా కృతజ్ఞతలు. కంటెంట్‌నే నిజమైన స్టార్ అని మరోసారి రుజువైంది” అన్నారు. అలాగే దర్శకుడు డొమినిక్ అరుణ్ విజన్ వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రశంసించారు.
టెక్నికల్ టీమ్ ప్రత్యేకత
ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ రచన, దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీని నిమిష్ రవి అందించారు. సంగీతాన్ని జేక్స్ బిజోయ్ సమకూర్చారు. ప్రపంచప్రసిద్ధ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపకల్పన చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లోక’ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
దుల్కర్ సల్మాన్ ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యే ప్లాన్ లేదు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.
ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధించింది?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ₹275 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: