हिन्दी | Epaper

Latest News: Rail Neer – రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు

Anusha
Latest News: Rail Neer – రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు

ప్రయాణికులకు భారతీయ రైల్వే మరో సంతోషకరమైన శుభవార్త అందించింది. ఇప్పటి వరకు రైళ్లలో విక్రయిస్తున్న తాగునీటి సీసాల ధరలను తగ్గిస్తూ రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ (IRCTC) ఆధ్వర్యంలో ‘రైల్ నీర్‌’ పేరుతో అందిస్తున్న ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల ధరలను సవరించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 అర్ధరాత్రి 12 గంటల నుంచే అమల్లోకి వస్తాయి.

ప్రస్తుతం రైళ్లలో, రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండే ఒక లీటరు రైల్ నీర్‌ (Rail Neer) బాటిల్ ధర రూ.15గా ఉండగా, దానిని రూ.14కు తగ్గించారు. ఇదే విధంగా అర లీటరు సీసా ధర రూ.10 ఉండగా, దాన్ని రూ.9కు తగ్గించారు. అంటే ఒక సీసా కొంటే ఒక రూపాయి చొప్పున ప్రయాణికులకు ఆదా అవుతుంది. ఈ తగ్గింపు రైల్వే బోర్డు గుర్తింపు ఇచ్చిన కంపెనీలు తయారుచేసే బాటిళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టతనిచ్చారు.ప్రయాణంలో ఆరోగ్యంతో పాటు ఆదా..

మరింత తక్కువ ధరకే లభిస్తుంది

మినరల్ రిచ్ వాటర్ రైల్ నీర్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది’’ అని ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. జీఎస్టీ శ్లాబు (GST slab)లను తగ్గింపుతోనే ‘రైల్ నీర్’ ధరలను రైల్వే సవరించింది. కొత్త జీఎస్టీ రేట్లతో చౌక ధరలకే ఎయిర్ కండిషనర్లు, సబ్ కాంట్రాక్ట్ పనులు, వస్తువుల రవాణా సేవలు వంటి ఇతర ఖర్చులను కూడా రైల్వేలు సమీక్షించాయి. వినియోగదారుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు సరఫరాదారు బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో అవసరమైన తనిఖీలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tgsrtc-festive-season-bus-fares-heavily-reduced/national/551544/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వరద భాదిత రాష్ట్రాలకు భారీ నిధుల విడుదలకు అమిత్ షా ఆమోదం

వరద భాదిత రాష్ట్రాలకు భారీ నిధుల విడుదలకు అమిత్ షా ఆమోదం

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం

తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

📢 For Advertisement Booking: 98481 12870