తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మరియు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), ప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగార్జునకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ మేరకు దత్తాత్రేయ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లి నాగార్జునను ఆహ్వానించడం జరిగింది.
దసరా సందర్భంగా సాంప్రదాయ అలయ్ బలయ్
ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని (festival of Dussehra)పురస్కరించుకుని హైదరాబాద్‌లో “అలయ్ బలయ్” అనే సాంప్రదాయ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో రాజకీయ, సాంస్కృతిక, మరియు సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు.
మత సామరస్యం, సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యం
ఈ కార్యక్రమం ద్వారా దత్తాత్రేయ మత, కుల, రాజకీయ విభేదాలకు అతీతంగా అందరిని ఒక వేదికపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత సామరస్యాన్ని చాటిచెప్పేలా, భారతీయ సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించడం జరుగుతుంది.
అక్టోబర్ 3న కార్యక్రమం
ఈ సంవత్సరం అలయ్ బలయ్ వేడుకలు అక్టోబర్ 3న జరగనున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఆహ్వానించిన దత్తాత్రేయ, తాజాగా అక్కినేని నాగార్జునకు ఆహ్వానం అందించడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: