ఉపాధ్యాయుడు (Teacher) అంటే క్రమశిక్షణకు మారుపేరు. పిల్లలు దారితప్పి ప్రవర్తిస్తే బుద్ధి చెప్పే టీచర్ వారే తప్పు చేస్తే ఇక పిల్లల్ని ఏం బాగుచేస్తారు? టీచర్లు పిల్లలకు ఏమైనా బోధించాలి అంటే ముందు వారు వాటిని పాటించాలి. ఓ ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు పిల్లల్ని కూడా సమాజానికి ఉపయోగపడేలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారు. అలాకాకుండా వారే దానితప్పితే! ఇదంతా ఎందుకుచెబుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీరే చదవండి ఆ వార్త ఏమిటో తెలుస్తుంది.
స్కూలుకు తాగొచ్చిన హెడ్ మాస్టర్
విజయనగరం (Vizianagaram) జిల్లా మెంటాడ మండలం కుంఠినవలస హైస్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ తాగొచ్చి స్కూలుకు వచ్చాడు. అంతేకాకుండా విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈవో ముందే అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు ఆ హెడ్ మాస్టర్ (Head Master). అంతటితో ఆగకుండా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినసదరు ఆఫీసర్ ముఖంపై చేయి చేసుకున్నాడు.
కోపంతో వారిపైనే రెచ్చిపోయాడు. ఈ టీచర్ వాలకం చూస్తుంటే పిల్లలపై ఎంతలా కోపడతాడో మరి చదువు ఏం చెబుతాడో ఆ పిల్లలకే తెలియాలి. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆయనలా పిల్లలు కూడా పాడైపోతారు అని విద్యార్థుల తల్లిదండ్రులు అక్రోశాన్నివ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: