మహానగరాల్లో జనజీవనం అద్భుతంగా ఉంటుందని భావిస్తారు. అన్ని సౌకర్యాలతో హాయిగా బతకొచ్చని అనుకుంటారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే రెండోవైపు నగరజీవితం దుర్భరమైనది. ఇది అనుభవ సత్యం. ఉద్యోగం కోసం గంటలకు గంటలు ట్రాఫిక్ చిక్కుకునిపోతాం. చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకునే లోపే ప్రాణాలు పోవచ్చు. రోజురోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతున్న వాహనాలతో పెరగని రోడ్లు, వెరసీ ట్రాఫిక్ జామ్ నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న నగరవాసుల వ్యథలు ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ముంబైలో రెండేళ్ల చిన్నారి నాల్గవ అంతస్తు నుండి పడినప్పటికీ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ వెంటనే చికిత్సకు నోచుకోలేక మరణించిన హృదయవిదారక సంఘటన ఇది. ఏకంగా ఐదుగంటల పాటు బాలుడుని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో(traffic jam) చిక్కుకునిపోయింది.

సకాలంలో చికిత్సకు నోచుకోని వైనం
ఆ మహారాష్ట్రలోని నలసోపారాలో జీవిస్తున్న ఓ కుటుంబానికి ఓ రెండేళ్ల బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ నాల్గవ అంతస్తు నుండి పడిపోయాడు. అయినప్పటికీ ఆ బాలుడు బతికాడు. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం కుటుంబ మొదట సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు బాలుడిని ముంబైకి తీసుకెళ్లమని సూచించారు. ఆ చిన్నారికి నొప్పి నివారణ మందులు ఇచ్చిన తర్వాత, ఆ కుటుంబం నలసోపారా నుండి ముంబైకి బయలుదేరింది.
చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ఏకంగా ఐదుగంటలు ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీంతో సకాలంలో బాలుడికి వైద్యం అందకపోవడంతో అంబులెన్స్ లోనే మరణించాడు. సకాలంలో బాలుడికి వైద్యం అందివుంటే తమకు ఈ దుఃఖం ఉండేది కాదని, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సహజంగానే అంబులెన్సులకు వాహనదారులు అడ్డురాకుండా ప్రయత్నిస్తాయి. సిగ్నల్స్(Signals) లలో కూడా అవి ఆగకుండా ప్రయాణించవచ్చు. అయితే కొన్నిసార్లు అంబులెన్స్‌లు ఎటూ కదలలేని విపరీతమైన వాహనంలో చిక్కుకుంటే అప్పుడు ఎవరేం చేయలేరు.
ప్రమాదం ఎలా జరిగింది?
ట్రాఫిక్ లో అంబులెన్స్ ముందుకు పోకమని, సమయానికి చికిత్స అందకపోవడం వల్ల చిన్నారి మృతి చెందాడు.
ఏ అంబులెన్స్ సంబంధించినది?
స్థానిక అత్యవసర సేవల అంబులెన్స్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: