హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల చేసిన నీటిపారుదలశాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మిడిహట్టిపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఎటువంటి అంచనాలు రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు.
బిఆర్యస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 35 వేల కోట్ల నిర్మాణ వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందిస్తుందని చెబుతూ చేస్తున్న ప్రకటనలు పూర్తిగా అసత్యమని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటివరకు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంచనాల ప్రక్రియనే ప్రారంభించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఎలా నిర్దారణకు వచ్చారని ప్రశ్నించారు.

హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ విమర్శలు
ఇలాంటి సత్యదూరమైన ప్రకటనలు హరీష్ రావు (Harish Rao)అతి తెలివి తేటలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ప్రజలు ఇటువంటి నిరాధారపూరితమైన మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉత్తమ్ తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తూ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఖర్చుపై హరీష్ రావు ఏమని చెప్పారు?
రూ. 35 వేల కోట్ల వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందిస్తుందని అన్నారు.
మంత్రి ఉత్తమ్ దీనిపై ఏమన్నారు?
ఆ ప్రకటనలు పూర్తిగా అసత్యమని, ఇప్పటివరకు ఎటువంటి అంచనాలు రూపొందించలేదని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: