హైదరాబాద్,(Hyderabad) సికింద్రాబాద్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్, ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 301 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15.85 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ దాడులు రైళ్లు, లాడ్జిలు, హోటళ్లు, ఇతర అనుమానిత ప్రదేశాల్లో జరిగాయి.

దాడులు, స్వాధీన వివరాలు
హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్(Enforcement) ఏఈఎస్ సౌజన్య పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చే రైళ్లలో తనిఖీలు చేసి 73 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీదేవి లాడ్జిలో 34 మద్యం బాటిళ్లను, ఆల్ఫా హోటల్ ముందు మరో వ్యక్తి వద్ద 34 బాటిళ్లను పట్టుకున్నారు. అమీర్పేట సీఐ పటేల్(CI Patel) బానోత్ అమీర్పేట ప్రాంతంలో 22 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో సోదాలు చేసి కర్ణాటకకు చెందిన 51 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో ఎన్ని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు?
మొత్తం 301 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన మద్యం బాటిళ్ల విలువ ఎంత?
పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.15.85 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: