ఆసియా కప్ 2025లో టీమిండియా కొత్త తరం ఆటగాళ్లలో ప్రత్యేకంగా నిలిచిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. యూఏఈ బౌలర్లను, ఆ తర్వాత పాకిస్థాన్ బౌలర్లను కూడా తీవ్రంగా ఎదుర్కొని వరుసగా భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. అతని దూకుడు ఆట శైలి, చురుకైన ఫీల్డింగ్, బౌలింగ్‌లో ఇచ్చే సహకారం కారణంగా టీమిండియాకు ఓ ముఖ్యమైన ఆస్తిగా అవతరించాడు.
తన క్రికెట్ ప్రస్థానంపై మాట్లాడిన అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కు ఆరాధ్య క్రికెటర్ అని స్పష్టంగా వెల్లడించాడు. 2007లో జరిగిన ప్రపంచకప్ టి20 టోర్నీలో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్‌కు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఘనతను చూసిన తర్వాతే తాను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆ ఘనత తనలో క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కల కన్నారు.
స్పిన్ ఆల్‌రౌండర్‌గా కెరీర్ ప్రారంభించిన అభిషేక్ శర్మ
యూఏఈతో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్సర్, ఫోర్‌గా మలిచిన్ అభిషేక్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులతో చిన్నపాటి తుఫాన్ సృష్టించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో షాహిన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) ని చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను 4, 6గా తరలించాడు. అతని మరుసటి ఓవర్‌లో మరో సిక్స్, బౌండరీ బాదాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో షాహిన్ షా అఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు.అతని ఫియర్‌లెస్ గేమ్ అభిమానులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను ఆకట్టుకుంది.

స్పిన్ ఆల్‌రౌండర్‌గా కెరీర్ ప్రారంభించిన అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ మార్గదర్శకంలో విధ్వంసకర బ్యాటర్‌గా మారాడు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ దగ్గరుండి బ్యాటింగ్ మెళకువలు నేర్పించాడు. అతని గైడెన్స్ అభిషేక్ శర్మకు కలిసొచ్చింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్.. ఆ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.
తన మెంటార్ యువరాజ్ సింగ్ తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన మెంటార్ యువరాజ్ సింగ్ తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పాడు.’యువరాజ్ సింగ్ నా ఆరాధ్య క్రికెటర్. యువీ పా.. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడం, భారత్ గెలిచిన ప్రపంచకప్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయడం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ క్షణమే టీమిండియా (Team India) కు ప్రాతినిథ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. యువీ పాను స్ఫూర్తిగా తీసుకొనే తాను క్రికెటర్‌గా ఎదిగాను.’అని ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ తెలిపాడు.అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007లో ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే.
భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూనే దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అతను మైదానంలో రక్తపు వాంతులు చేసుకున్నాడు. అయినా వెనకడుగు వేయకుండా టోర్నీలో కొనసాగి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అనంతరం క్యాన్సర్‌కు చికిత్స తీసుకోని కోలుకున్న యువరాజ్ సింగ్.. మునపటిలా ఆడలేకపోయాడు. దాంతో భారత జట్టుకు దూరమై 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: