
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషభ’ (Vrusshabha Movie) ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా, కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్. వ్యాస్ స్టూడియోస్, ఆశీర్వాద్ సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కలిసి సమర్పిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా వంటి పలువురు నిర్మాతలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం దీని స్థాయిని, విస్తృతతను స్పష్టంగా చూపిస్తుంది.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘వృషభ’ను ఈ దీపావళి (Diwali)కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. పలు భాషల్లో ఒకేసారి విడుదల కాబోయే ఈ సినిమా మోహన్‌లాల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం బృందంలో కనిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన యోధుడి లుక్‌లో దర్శనమివ్వబోతున్నారని టీజర్ ద్వారా స్పష్టమైంది.
ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నారు
ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ చూస్తుంటే.. మోహన్‌లాల్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ ప్యాక్డ్గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.మోహన్‌లాల్ (Mohanlal) గతంలోనూ పలు సార్లు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించినా, ‘వృషభ’లో ఆయన లుక్, ప్రదర్శన మరింత కొత్తదనాన్ని అందించనుందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్‌లో పెద్ద హైప్ నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: