బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలు జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యేకంగా యువతను ఆకట్టుకునేందుకు పలు పథకాలను (Schemes) ప్రకటిస్తున్నారు. ఇందులో తాజాగా డిగ్రీ పాసైన నిరుద్యోగులకు నెలకు రూ. 1000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ‘ముఖ్యమంత్రి స్వయం సహాయ భృతి పథకం’ పరిధిని విస్తరిస్తున్నట్లు గురువారం సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇకపై డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.

రెండేళ్లపాటు ఆర్థిక సాయం
ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.1000 చొప్పున గరిష్ఠంగా రెండేళ్లపాటు భృతి అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నిరుద్యోగులకు మాత్రమే వర్తించేది. ప్రభుత్వ ‘7 నిశ్చయ్’ కార్యక్రమంలో భాగంగా ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు.
ఎవరు అర్హులు అంటే?
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే యువతకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్దేశించింది. దరఖాస్తు చేసుకునే యువత వయసు 20 నుంచి 25 ఏళ్లమధ్య ఉండాలి.
– వారు ఎలాంటి ఉన్నత చదువులు కొనసాగిస్తూ ఉండరాదు.
– ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఏ ఇతర రంగంలోనూ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
-స్వయం ఉపాధిలో ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులు
కోటి మంది యువతకు ఉపాధి
2005 నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటటి నుంచి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వ పాధాన్యతగా ఉంది’ అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో(private sector) కలిపి కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయాన్ని యువత సద్వినియోగం చేసుకుని అవసరమైన శిక్షణ పొంది, పోటీ పరీక్షలకు సిద్ధమై తమ భవిష్యత్తును సురక్షతం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని నితీశ్ కుమారు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
నితీష్ కుమార్ ఏ వర్గానికి వరాలజల్లు కురిపించారు?
ప్రధానంగా యువతకు ప్రయోజనం కలిగే విధంగా పథకాలు ప్రకటించారు.
ఈ పథకాలలో ఏ రంగాలు ప్రాధాన్యం పొందాయి?
ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: