ప్రకృతి విలయంతో ఉత్తరాఖండ్ అల్లాడుతున్నది. చమోలి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. (Landslides) దీంతో నాలుగు గ్రామాల్లో 30కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 మంది గాయపడగా 14 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వారు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారం భారీ వర్షం కారణంగా వరదలు (floods) సంభవించాయి. దీంతో చమోలి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. 30కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 20 మంది గాయపడ్డారు. 14 మంది జాడ కనిపించడం లేదు. దీంతో అదృశ్యమైన వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కాగా, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తలకు గాయమైన చిన్నారితో సహా తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తరాఖండ్లో ఎన్ని కొండచరియలు విరిగిపడ్డాయి?
1988 మరియు 2023 మధ్య, ఉత్తరాఖండ్‌లో 12,319 కొండచరియలు విరిగిపడటం నమోదైంది. అయితే, ఇటీవల ఈ సంఖ్య పెరిగింది: 2018: 216 కొండచరియలు విరిగిపడటం. 2019: 254 కొండచరియలు విరిగిపడటం.
2025 లో ఉత్తరాఖండ్లో ఎంత మంది మరణించారు?
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ మరియు పరిసర ప్రాంతాలలో మంగళవారం (సెప్టెంబర్ 16, 2025) రాత్రిపూట కుండపోత వర్షం మరియు వరదలు విధ్వంసం సృష్టించడంతో కనీసం 13 మంది మరణించారు మరియు 16 మంది గల్లంతయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: