మంచు లక్ష్మీ: “ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటున్నా” మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన “దక్ష” (Daksha) అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది మంచు లక్ష్మీ. (Manchu Lakshmi) ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుండగా, ప్రమోషన్లలో ఆమె బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఆ నగర లైఫ్‌స్టైల్ బాగా నచ్చింది.
మంచు లక్ష్మీ (Manchu Lakshmi) మాట్లాడుతూ – “ఇటీవల కాలంగా నేను ముంబైలోనే ఉంటున్నాను. నాకు ఆ నగర లైఫ్‌స్టైల్ బాగా నచ్చింది. ఉదయం లేచి పనుల్లో నిమగ్నమవడం అక్కడి రొటీన్. రానా, చరణ్, సూర్య (Surya) లాంటి మా స్నేహితులు ముందే అక్కడికి వచ్చి సెట్ అయ్యారు. నేను ప్రస్తుతం అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నాను. తాప్సీ, రకుల్ (Rakul) లాంటి ఫ్రెండ్స్‌తో అక్కడ కలుస్తుంటాను” అని తెలిపారు.

Manchu Lakshmi
ఫిల్మ్ నగర్లో ఉన్న ఇల్లు నాన్నది
అలాగే తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇస్తూ – “నా దగ్గర సొంత ఇల్లు లేదు. ఫిల్మ్ నగర్లో ఉన్న ఇల్లు నాన్నది, నేను కొంతకాలం అక్కడే ఉన్నాను అంతే. అందుకే ‘ఇల్లు అమ్మకానికి పెట్టింది’ అన్న వార్తలు నిజం కావు. అవును, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను కానీ వాటిని అధిగమించడానికి నేను ఎల్లప్పుడూ పట్టుదలగా ముందుకు సాగుతాను. ఎక్కడ ఉన్నా నన్ను చూసి ఇతరులు ధైర్యం తెచ్చుకునేలా జీవిస్తాను కానీ ఎప్పుడూ వెనుకడుగు వేయను” అని అన్నారు.
మంచు లక్ష్మీ ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు?
ఆమె ప్రస్తుతం ముంబైలో అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నారు.
ముంబైలో ఆమె కలుస్తూ ఉండే ఫ్రెండ్స్ ఎవరు?
తాప్సీ, రకుల్‌తో కలుస్తూ ఉంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: