(Modi) మోదీ–సుశీలా కర్కి ఫోన్ సంభాషణ: నేపాల్లో శాంతి స్థాపనకు భారత్ మద్దతు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో (Sushila Karki) ఫోన్లో మాట్లాడారు. ఇటీవల ఆ దేశంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నేపాల్ (Nepal) లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.
సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ (Modi) ఆమెతో మాట్లాడటం ఇదే తొలిసారి. గత వారం ఆందోళనలు, అవినీతి వ్యతిరేక నిరసనలు తీవ్రస్థాయికి చేరి హింసకు దారితీశాయి. ఈ ఘటనల్లో 70 మందికి పైగా మృతిచెందగా, 1800 మందికి పైగా గాయపడ్డారు. పెరుగుతున్న నిరసనల కారణంగా అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో నిరసనకారుల ప్రతిపాదన మేరకు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు.

Modi
ఓ చారిత్రక ఘట్టమని
తన X ఖాతాలో ఈ సంభాషణ వివరాలను మోదీ పంచుకున్నారు. ఆయన ఇలా పేర్కొన్నారు: “నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో మాట్లాడాను. ఘర్షణల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేశాను. నేపాల్లో శాంతి, పురోగతికి భారత్ (Bharath) సంపూర్ణ మద్దతు ఇస్తుంది.”మహిళా ప్రధానిగా కర్కి నియామకం, మహిళా సాధికారతకు ఓ చారిత్రక ఘట్టమని మోదీ ప్రశంసించారు. భారత్–నేపాల్ మైత్రి అనుబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ సంభాషణ దోహదపడుతుందని రెండు దేశాలు నమ్ముతున్నాయి.
ప్రధాని మోదీ ఎవరితో ఫోన్లో మాట్లాడారు?
నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కితో.
ఫోన్ సంభాషణలో మోదీ ఏమి వ్యక్తం చేశారు?
ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ, నేపాల్లో శాంతి, స్థిరత్వానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: