ఖమ్మం : పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం ఉదయం నిర్వహించిన తెలం గాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని తెలియజేసారు. రైతాంగం, కూలీలు భూమి కొరకు, భుక్తి కొరకు భూ పోరాటాలు చేసి, నిజాంప్రభుత్వ సాయుధ రజాకార్లను ఎదురించారని, నిజాం సంస్థానాన్ని సమాఖ్య భారతదేశం ప్రజా పాలనలో భాగంగా,చేయుటకు ఎన్నో పోరాటాలు జరిగాయనీ, ఖమ్మం జిల్లాకు కూడా ఇట్టి పోరాటాలలో ప్రముఖమైన పాత్ర ఉందని తెలిపారు.
ఆనాడు స్వామి: రామానంద తీర్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జమలాపురం కేశవ రావు మహనీయులు, కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ (Chakali Ilaymma) లాంటి అనేక మంది పోరాటంలో భాగస్వామ్యం అయ్యారని, రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని ప్రజా స్వామ్య పాలనలో భాగస్వామ్యం చేశారని, ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మాహాకవి దాశరథి ఖమ్మం జిల్లా నుంచి ప్రయాణం సాగించారని, ఆనాడు,సంఘాల ఏర్పాటులో, గ్రంథాలయ ఉద్యమాలలో, రజాకార్లకు వ్యతిరేకంగా.
ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి
వీరొచితంగా జరిగిన పొరాటంలో ఖమ్మంకు ప్రముఖ పాత్ర ఉందని, బొమ్మ కంటి సత్యనారాయణ రావు, రామ్ చండర్ రావు, శీలం సిద్ధారెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్, మహ్మద్ రజబ్ అలీ, వెంగళరావు లాంటి అనేక ప్రముఖులు మన జిల్లా నుంచి ప్రముఖ పాత్ర పోషించారని, ఖమ్మం ప్రాంతం నుండి ఇమ్రోజ్ ఉర్దూ పత్రికా ఎడిటర్ అయిన షోయబ్ ఉల్లా ఖాన్ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కలమెత్తి రజాకార్ల చేతిలో మరణించారని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించడం జరిగిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం గ్యారెంటీ పథకాలను (Abhayahastam Guarantee Schemes) ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్వంటి అనేక సంక్షేమ పథ కాలను అమలు చేస్తున్నామని అన్నారు..
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా
తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ను ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. 2030 నాటికి లక్షా 98 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసి లక్షా 14 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇందిరా మహిళ శక్తి పథకం (Woman Power Scheme) క్రింద మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందిరా సౌర గిరి జల వికాసం క్రింద మన జిల్లాలో మొదటి విడత క్రింద 550 లబ్దిదారులను ఎంపిక చేసి సోలార్ పంపు సెట్ల ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 128 రెసిడెన్షియల్ పాఠశాలలో 20 వేల 502 మంది విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం వసతి కల్పిస్తున్నామని అన్నారు, జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో 200కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో, ఇంగ్లీష్ మీడియం బోధనతో యంగ్ ఇండియా (Young India) సమీకృత గురుకులాల నిర్మాణం చేపట్టామని అన్నారు. రేషన్ కార్డులను అర్హులైన పేద కుటుంబాల అందరికీ పంపిణీ చేస్తున్నామని, మన జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లను జారీ చేశామని అన్నారు.
క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు పురోగతిలో
రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, మధిర, సత్తుపల్లి పట్టణాలలో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆసుపత్రి, కల్లూరులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్, పెనుబల్లి నందు 7 కోట్ల 50 లక్షలతో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. పాలేరు, సత్తుపల్లి పట్టణాల్లో 25 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ చేపట్టిన నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షలు ఖర్చు చేస్తూ చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నందు 23 కోట్ల 50 లక్షలతో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు..
బీసిలకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు.130 కోట్లతో వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయనీ, 139 కోట్లతో 10. రెండు వరుసల రహదారిని 4 వరుసల రహదారులుగా విస్తరించడం జరిగిందనీ, సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో లక్షా 38 వేల 790 ఎకరాలలో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పన చేస్తున్నామని, దీని ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా, లంక సాగర్ ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: