నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్తగా కృష్ణతం చూపుతున్న మంచు లక్ష్మి, తన ‘టీచ్ ఫర్ చేంజ్’ (Teach for Change) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించారు. తాజాగా, అమరావతి పరిధిలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఆమె దత్తత తీసుకున్నారు.
“పాఠశాలలకు కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత మాది”
తెలంగాణలోని జగిత్యాల (Jagtial) జిల్లాలో కూడా 10 పాఠశాలలను ఇప్పటికే దత్తత తీసుకున్నట్లు గుర్తుచేసిన మంచు లక్ష్మి, ఇప్పుడు అమరావతిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. “విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన విద్యను పొందేలా మౌలిక సదుపాయాలను అందించడమే మా లక్ష్యం,” అని ఆమె స్పష్టం చేశారు.
దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు
ఈ కార్యక్రమాన్ని కేవలం తమ సంస్థే కాకుండా, ఇతర దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని మంచు లక్ష్మి వివరించారు. పాఠశాలలకు అవసరమైన వసతులు – పాఠశాల భవనాల మెరుగుదల, టాయిలెట్లు, డిజిటల్ క్లాస్‌రూంలు, స్పోర్ట్స్ కిట్‌లు మొదలైనవన్నీ అందించనున్నట్లు తెలిపారు.
సేవలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు
తమ సేవా కార్యక్రమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంచు లక్ష్మి తెలిపారు.
“విద్యారంగంలో అసలైన మార్పును తీసుకురావాలన్నదే మా లక్ష్యం. ‘టీచ్ ఫర్ చేంజ్’ ద్వారా మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సేవలు విస్తరిస్తాం” అని ఆమె పేర్కొన్నారు.
సెప్టెంబర్ 19న ‘దక్ష’ రిలీజ్
ఇతర విషయాలపై మాట్లాడిన మంచు లక్ష్మి, తన ప్రధాన పాత్రలో నటించిన ‘దక్ష’ సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ చిత్రం తాను నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల మాదిరిగానే ఒక సందేశాత్మక కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: