బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు తన తండ్రి రాకేష్ రోషన్ (Rakesh Roshan) దర్శకత్వం వహించిన “క్రిష్” సిరీస్‌లో హీరోగా మాత్రమే కనిపించిన హృతిక్, ఇప్పుడు నాల్గవ భాగాన్ని స్వయంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. “క్రిష్ 4” ద్వారా ఆయన మొదటిసారిగా మెగాఫోన్ పట్టబోతున్నారన్న వార్త సినీప్రియుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.
“కోయి మిల్ గయా” నుంచి ప్రారంభమైన ఈ సూపర్‌హీరో ఫ్రాంచైజీకి భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ప్రేమను చూపించారు. హాలీవుడ్ సూపర్హీరోలకే పరిమితమైన యాక్షన్ & విజువల్ ఎఫెక్ట్స్‌ను, దేశీయ స్థాయిలోనే అందించి, “క్రిష్” సిరీస్ పాన్-ఇండియా సెన్సేషన్‌గా నిలిచింది. “క్రిష్ 3” (“Krrish 3”) తర్వాత ఈ ఫ్రాంచైజీపై వచ్చిన ఉత్సాహం ఇంకా తగ్గకముందే, హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారన్న వార్త మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.

కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది
దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికకు సంబంధించి ఒక క్రేజీ వార్త బీ టౌన్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
కొన్ని బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, క్రిష్ 4 టీమ్ రష్మిక (Rashmika Mandanna ) ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించిందని ఆమె కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటించారు. అయితే ఈసారి మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రష్మిక పేరు వినిపిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: