हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Fish Oil Capsules – ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..

Sudha
Latest Telugu news : Fish Oil Capsules – ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..

చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. చేప‌ల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు (Nutrients)ఉంటాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి అనేక లాభాల‌ను అందిస్తాయి. చేప‌ల్లో ఈపీఏ, డీహెచ్ఏ అనే రెండు ముఖ్య‌మైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిని మ‌న శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. బ‌య‌టి నుంచి అందించాలి. అయితే ఈ పోష‌కాలు రెండూ చేప‌ల్లో అధికంగా ఉంటాయి. క‌నుక‌నే త‌ర‌చూ చేప‌ల‌ను తినాలని పోష‌కాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే చేప‌ల‌ను త‌ర‌చూ తిన‌లేమ‌ని భావించే వారు వాటికి చెందిన ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను (Fish Oil Capsules)రోజూ వాడ‌వ‌చ్చు. వీటితో కూడా ఈపీఏ, డీహెచ్ఏ పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను (Fish Oil Capsules)వాడాల‌ని అప్పుడ‌ప్పుడు డాక్ట‌ర్లు సైతం సూచిస్తుంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల కూడా అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Fish Oil Capsules -   ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..
Fish Oil Capsules – ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..

క్యాప్సూల్స్ తో కొవ్వు క‌రిగిపోతుంది..

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను(Fish Oil Capsules) వాడ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. ఈ క్యాప్సూల్స్‌ను వాడితే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ క్యాప్సూల్స్ఎంతో మేలు చేస్తాయి. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. ఈ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను తీసుకుంటే శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా, బాహ్యంగా వ‌చ్చే వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా గుండె కండ‌రాలు, ర‌క్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. ఈ క్యాప్సూల్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి ర‌క్త నాళాలు డ్యామేజ్ అవ‌కుండా ర‌క్షిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. అలాగే ర‌క్త నాళాల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. దీంతో గుండె పోటు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

మైండ్ రిలాక్స్

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. ఈ క్యాప్సూల్స్‌లో ఉండే డీహెచ్ఏ మెద‌డు క‌ణాల‌తోపాటు కంటి రెటీనాను ర‌క్షిస్తుంది. దీని వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఈ క్యాప్సూల్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. నాడులు ఉత్తేజిత‌మ‌వుతాయి. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. చురుగ్గా ఉంటారు. బ‌ద్ద‌కం పోతుంది. గ‌ర్భిణీలు వాడితే శిశువు ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా నివారించ‌వ‌చ్చు.

Fish Oil Capsules -   ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..
Fish Oil Capsules – ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లో ఎన్ని పోష‌కాలు ఉన్నాయో తెలుసా..

వైద్యుల స‌ల‌హా తప్పనిసరి..

ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను వాడ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లిగే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ ఇవి చేప‌ల‌కు ప్ర‌త్యామ్నాయం కావు. చేప‌ల‌లో ఈపీఏ, డీహెచ్ఏలు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భిస్తాయి. క‌నుక వీలైనంత వ‌ర‌కు చేప‌ల‌ను తర‌చూ తిన‌డ‌మే మంచిది. అలా కుద‌ర‌ని ప‌క్షంలోనే ఈ క్యాప్సూల్స్‌ను వాడాల్సి ఉంటుంది. అది కూడా న్యూట్రిష‌నిస్టు లేదా వైద్యుల స‌ల‌హా మేర‌కు మాత్ర‌మే ఈ క్యాప్సూల్స్‌ను వాడాల్సి ఉంటుంది. లేదంటే కొంద‌రిలో ఈ క్యాప్సూల్స్ సైడ్ ఎఫెక్ట్స్‌ను క‌లిగించే అవ‌కాశం ఉంటుంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ను నిపుణులు సూచించిన మోతాదులో వాడితే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఈ క్యాప్సూల్స్‌ను చేప‌ల ఆయిల్ నుంచి త‌యారు చేస్తారు క‌నుక వెజిటేరియ‌న్లు వీటిని వాడ‌లేరు. అలాంటి వారికి ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ క్యాప్సూల్స్ ల‌భిస్తాయి. వాటిని కూడా వాడ‌వ‌చ్చు. అవి కూడా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ లాగే ఒకేలాంటి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. ఇలా ఈ క్యాప్సూల్స్‌తో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

చేప నూనె గుళికలు దేనికి మంచివి?

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో చేప నూనె సప్లిమెంట్లు నొప్పిని తగ్గించడంలో, ఉదయం వేళల్లో దృఢత్వాన్ని మెరుగుపరచడంలో మరియు కీళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉపశమనం తరచుగా స్వల్పంగా ఉన్నప్పటికీ, శోథ నిరోధక మందుల అవసరాన్ని తగ్గించడానికి ఇది సరిపోతుంది.

చేప నూనె గుళికలను రోజూ తీసుకోవడం మంచిదేనా?

నోటి ద్వారా తీసుకున్నప్పుడు: చేప నూనెను రోజుకు 3 గ్రాములు లేదా అంతకంటే తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా మందికి సురక్షితం. రోజుకు 3 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం పెరుగుతుంది. చేప నూనె దుష్ప్రభావాలలో గుండెల్లో మంట, వదులుగా ఉండే మలం మరియు ముక్కు నుండి రక్తం కారడం వంటివి ఉంటాయి. చేప నూనె సప్లిమెంట్లను భోజనంతో పాటు తీసుకోవడం లేదా వాటిని ఫ్రీజ్ చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

చేప నూనె గుళికల దుష్ప్రభావాలు ఏమిటి?

చేప నూనె సప్లిమెంట్లు అసహ్యకరమైన వాసన మరియు జీర్ణశయాంతర లక్షణాలు వంటి దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. ఇది రక్తస్రావం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిమిత ఆధారాలు సూచిస్తున్నాయి. కొన్ని చేపలు మరియు వాటి నూనెలు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, వీటిని ఆరోగ్య నిపుణులు ప్రజలు తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.


Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/carrot-daily-benefits-eyesight-heart-health/health/548616/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

📢 For Advertisement Booking: 98481 12870