కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నుండి లైసెన్స్ పత్రాలు స్వీకరించిన సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్
గోదావరిఖని: సింగరేణి సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ చేయడానికి అనుమతిస్తూ జారీచేసిన లైసెన్సులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ కు అందజేశారు. మంగళవారం హైదరాబాద్ లోని టీ హబ్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్ లో కటిని అందజేశారు. గత మార్చి నెలలో కేంద్ర నుల శాఖ నిర్వహించిన కీలక ఖనిజాల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని 37.75 తతతో కర్ణాటక రాష్ట్రంలోని విస్తర గల బంగారం, రాగి ఖనిజాల అన్వేని దక్కించుకుంది. దీనికి సంబంధించిన లైసెన్సు, కేంద్ర మంత్రి శ్రీ సర్టిఫికెట్లను మంగళవారం జి. కిషన్ రెడ్డి అందజేశారు.
మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ కీలక రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కృషి చేయాలన్నారు. దేశంలో కీలక ఖనిజ రంగం (Mineral sector)అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. కీలక ఖనిజాల అన్వేషణకు వేలంపాటలో విజేతలైన వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. వెంటనే అన్వేషణ పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ తో పాటు తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, సింగరేణి డైరెక్టర్ (పి.పి) కె.వెం కటేశ్వర్లు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మార్కె టింగ్ ఎరోయిన్న శ్రీనివాస్.పు. జనరల్ మేనేజర్ ఆర్ అండ్ డి కనకయ్య పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: