ఇండస్ట్రీలో ప్రతిభాపరంగా అగ్ర స్థాయిలో ఉన్న రజనీకాంత్, తన తదుపరి చిత్రాన్ని గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ప్రముఖ నటుడు, నిర్మాత కమల్ హాసన్ బ్యానర్‌లోనే రజనీకాంత్ నటించబోతున్నారని ప్రకటించారు.ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) తన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మంచి విజయం సాధించి, ఆయన ప్రతిభను మరింత నిరూపించింది. ప్రస్తుతం ఆయన ‘జైలర్ 2’ సినిమా (Jailer 2 movie) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో జరుగుతున్నది.

చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి పయనమై అక్కడ చేరారు
రజనీకాంత్ చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి పయనమై అక్కడ చేరారు. ఆ సమయంలో మీడియా వారిని వారి తదుపరి ప్రాజెక్ట్ గురించి అడిగింది.నా తదుపరి చిత్రం రాజ్ కమల్ బ్యానర్‌లో చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కమల్, నేను కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఆశపడుతున్నారు. మేము కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు కథ సెట్ అయినప్పుడు కలిసి నటిస్తాం. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి కథ, దర్శకుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం అంటూ రజనీ చెప్పుకోచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: