ఊపిరి బిగబట్టి చూసే తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇంద్ర’ (Crime thriller ‘Indra’) – ఇప్పుడు ఓటీటీలో! కోలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ హవా కొనసాగుతూనే ఉంది. ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వచ్చిన తాజా చిత్రం ఇంద్ర. శబరీశ్ నంద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వసంత్ రవి, మెహ్రీన్, అనికా సురేంద్రన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘జైలర్’ (Jailer) లో రజనీ కుమారుడి పాత్ర పోషించిన వసంత్ రవి (Vasanth Ravi) ఇందులో హీరోగా కనిపించనున్నారు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్న సునీల్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్ చేశారు. థియేటర్లలో ఆగస్టు 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి సన్ నెక్స్ట్ మరియు టెంట్ కొట్టా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

Vasanth Ravi
అతని చూపు ఎలా పోయింది?
కథలో హీరో (Vasanth Ravi) ఒక పోలీస్ ఆఫీసర్. అనుకోని సంఘటన కారణంగా అతను సస్పెండ్ అవుతాడు, అదే సమయంలో చూపు కోల్పోతాడు. జీవితంలో కష్టాల మధ్య గడుపుతుండగా అతని భార్య హత్యకు గురవుతుంది. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుండగా అంధుడైన ఆ పోలీస్ (police) ఆఫీసర్ స్వయంగా రంగంలోకి దిగుతాడు. అతని చూపు ఎలా పోయింది? భార్యను హత్య చేసింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు సాగుతుంది.
Indra సినిమా ఏ జోనర్‌కి చెందినది?
Indra ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కి చెందిన తమిళ సినిమా.
ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరు?
శబరీశ్ నంద ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: