హైదరాబాద్: గోదావరి పరివాహక ప్రాంతాన్ని మూడు భాగాలుగా అధ్యయనం చేశామని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో గోదావరి తక్కువ కాలుష్యానికి గురైందని డబ్ల్యూఐఐ(WII) (వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) డీన్ డాక్టర్ రుచిబదోలా అన్నారు. సోమవారం వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ హోటల్లో సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ భారతదేశంలోని నదుల పర్యావరణ పరిస్థితులను అంచనా వేసి వాటి సంరక్షణ కోసం సరైన ప్రణాళికలు అమలు చేయడానికి మొత్తం 7 నదులను ఎంపిక చేసినట్ల తెలిపారు. నదుల్లో ఇసుక క్వారీ(Sand Quarry)ల నియంత్రణ సరైన విధంగా అమలు కావడంలేదని, మితిమీరిన ఇసుక తవ్వకాల వల్ల భవిష్యత్తులో ఆనకట్టలు, వంతెనలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, నదీ జలాల పక్కన నీటిని శుద్ధి చేసి చెట్లు, గడ్డి జాతుల మొక్కలు నాటాలని సూచించారు. సుమారు 25 ఏళ్ల క్రితం భారతదేశంలోని నదులు, చెరువుల్లో విదేశీ జాతుల చేప పిల్లలను (ప్రధానంగా ఆఫ్రికన్ జాతి) విడిచారని, ప్రస్తుతం అవి స్థానిక భారతీయ చేపల కంటే ఎక్కువగా విస్తరించినట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా కార్ప్ టిలాపియా అనే చేపలు దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

వలల వాడకం విషయంలో కూడా ప్రత్యేక దృష్టి అవసరమని నిపుణులు సూచించారు. చిన్నపల్ల చేపలను కూడా పట్టే విధంగా వలలను ఉపయోగించడం వల్ల స్థానిక జాతుల పెంపకం దెబ్బతింటుందని, ఇది భవిష్యత్తులో చేపల నది జనాభా తగ్గిపోవడానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అందువల్ల మత్స్యకారులు శాస్త్రీయ పద్ధతిలో వలలను వాడాలని, చిన్న చేపలకు పెరుగుదలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని పర్యావరణ పరిస్థితులను క్రమం తప్పకుండా. పర్యవేక్షించడం ద్వారా మాత్రమే జీవవ్యవస్థను కాపాడగలమని, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతోసమన్వయం చేసుకొని సంరక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి డాక్టర్ సువర్ణ జియో లాజిక్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ పాండి, పిసిబి నుంచి డాక్టర్ ప్రసాద్, గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డ్ మెంబెర్(టెక్నికల్) ఇరిగేషన్, సిసిఎంబి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఉమాపతి, సిసిఎంబి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కార్తికేయన్, బయో డైవర్సిటీ నుంచి శిల్పి శర్మ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి నదీపరీవాహక ప్రాంతాన్ని మూడు భాగాలుగా ఎందుకు విభజించారు?
నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణ కోసం, వరదల నియంత్రణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించి అధ్యయనం చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: