పరాయిదేశంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అక్కడి చట్టాలను, విధానాలను తప్పనిసరిగా మనం గౌరవించాల్సిందే. అప్పుడే అక్కడ మనం మనుగడను సాగించగలం. అలాకాకుండా పరాయిదేశంలో కానీ పనులుచేస్తే పోయేది మనదేశం పరువే. అసలే అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను తగ్గించే ఉద్దేశంతో వీసాలపై భారీ కఠిన నియమాలను(Strict rules) తీసుకొస్తున్నారు. సాధ్యమైనంతవరకు విదేశీయుల రాకను అరికట్టేందుకు ట్రంప్
తనశక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అక్రమంగా నడచుకున్నవారిని వెంటనే సొంతదేశాలకు పంపేందుకు వెనుకాడడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అమెరికాలో ఉంటున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాకాకుండా ఎవరూ చూడడం లేదని, దొంగతనాలకు పాల్పడి, పోలీసులు అరెస్టు వరకు వెళ్తే, పోయే పరువు ఎవరిది? మనదేశం పరువేకదా! చదువు, ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికి పెరిగి పోతున్నది. మరి అక్కడ ఎంత పద్ధతిగా జీవించాలి? ఇటీవల అమెరికా షాపింగ్ మాల్స్ లో చోరీలు చేస్తున్న భారతీయులు తరచూ పట్టుపడుతూ, దేశం పరువు తీస్తున్నారు. తాజాగా ఓ యువతి అమెరికాలోని కొన్ని షాపింగ్ మాల్స్ లో చోరీలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె తనను విడిచిపెట్టాలని పోలీసులను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ యువతి ఇప్పటికే పలు షాపింగ్ మాల్స్ లలో ఇదేవిధంగా దొంగతనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించి, ఆ యువతిని అరెస్టు చేశారు.

పోలీసులకు దొరికిపోయిన మరో ఇద్దరు యువతులు
అమెరికాలోని ఒక షాప్లో దొంగతనం చేస్తూ ఇద్దరు భారతీయ విద్యార్థినులు దొరికిపోయారు. వారిని షాప్ యజమాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా షాపు యజమాని వారిని పట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు దోపిడికి పాల్పడ్డారని నిర్ధారించుకుని అధికారులు అరెస్టు (Arrest)చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భారతీయులూ మీరు ఏ ఉద్దేశంతో విదేశాలకు వెళ్లారో మర్చిపోయి.. అక్కడ అక్రమాలు, అన్యాయాలకు పాల్పడితే అది మీ కెరీర్ జీవితాలకే కాదు, దేశానికి చెడ్డపేరు తెచ్చిన వారుగా మిగులుతారు. తస్మాద్ జాగ్రత్త..
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ పై ఆరోపణలు ఏమిటి?
కొంతమంది విద్యార్థులు తప్పుడు పత్రాలతో, నకిలీ రికార్డులతో ప్రవేశం పొందడం, మోసపూరిత చర్యలు చేయడం వల్ల దేశ పరువు తీస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ సంఘటనలు భారత్ ప్రతిష్టపై ఎలా ప్రభావం చూపుతున్నాయి?
అంతర్జాతీయంగా భారతీయులపై నమ్మకం తగ్గిపోవడం, నిజాయితీగా చదువుకునే విద్యార్థులు కూడా అనుమానాస్పదంగా చూడబడే పరిస్థితి ఏర్పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: