అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) కి ఎఫ్సిఆర్ఎ (FCRA) లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా కేంద్రం హోంశాఖ మొండికేసిందనే ఆక్రోశంతో వేల సంఖ్యలో లబ్దిదారులు సోమవారం అనంతపురంకి తరలివచ్చారు. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అన్న తేడా లేకుండా ఆర్డిటి లబ్దిదారులు పెద్దఎత్తున చీమ పుట్టల్లా కదలి వచ్చి అనంతపురం వీధుల్లో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సేవ్ ఆర్డిటి పేరుతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పాల్గొనడం ఒక ఎత్తైతే, పిడికలు బిగించి ఆర్డిటికి ఎఫ్సఆస్ఏ అనుమతులను ఇవ్వాల్సిందే అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్, అక్కడక్కడ తరలివచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా లబ్దిదారులు ప్రతిఘటించడంతో చేసేది లేక పోలీసులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. జెఎసి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదిన కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. రెండవ విడుతగా సోమవారం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఆర్డిటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం పొందిన లబ్దిదారులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న కాలేజీ గ్రౌండ్లోకి నిరసన లబ్దిదారులంతా చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకున్నారు.

Anantha
విన్సెంట్ విగ్రహం వద్దకు చేరుకుని
ర్యాలీలో పెద్ద ఎత్తున కళాకారులు కూడా డప్పులు వాయిస్తూ తప్పెట్లు కొడుతూ, ఉరుములు వాయిస్తూ ఆందోళన కారులను ఉత్సాహ పరిచారు. గొరవయ్యలు కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ వద్దకు చేరుకుని గంటల తరబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ విగ్రహం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసి కలెక్టరేట్ కార్యాలయంకు చేరుకున్నారు. ఆర్డిటికి ఎఫిసిఆర్ఎ లైసెన్స్ పునరుద్ధరించే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chief Minister Chandrababu Naidu) అనుకుంటే పని అవుతుందని ఎన్డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డిటి ప్రజలకు సేవ చేసే విధంగా తోడ్పడాలని జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వెనుకబడిన జిల్లాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్న ఆర్డిటిని రక్షించుకుంటామని పలు ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ బిసి సంఘాల నాయకులు వెల్లడించారు.
ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఎ నిలుపుదల చేయడంతో భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోతాయని, ఆర్డిటి సంస్థ ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ కోసం దరఖాస్తుచేసుకుని నెలలు గడుస్తున్నా స్పందించడం లేదని, పరిస్థితి ఇలాగె కొనసాగితే ఆందోళనలు ఉదృతం చేయాల్సి వస్తుందని, నాయకులు హెచ్చరించారు. ఆర్డిటి సంస్థను విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించగా ఆ సంస్థ దశల వారీగా విస్తరించి లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆర్డిటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఎంతో న్యాయం జరిగిందని జేఎసి నాయకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో ఆణిముత్యాలను తయారు చేసేందుకు ఆర్డిటి ఎంతో కృషి చేస్తోందని, అనంతపురంలో క్రికెట్ స్టేడియం నిర్మించడంతో దేశ, విదేశాల నుంచి శిక్షకులను రప్పించి ఫుట్ బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడల్లో శిక్షణ ఇస్తోందని దేశంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో పోటీ పడే విధంగా ఆర్డిటి చర్యలు తీసుకుంటోందన్నారు.
అనంతపురంలో ఆర్డిటి లబ్ధిదారులు ఎందుకు ఆందోళన చేపట్టారు?
A: కేంద్ర హోంశాఖ ఆర్డిటి (Rural Development Trust)కి FCRA లైసెన్స్ రీన్యువల్ చేయకపోవడంపై ఆందోళన చేపట్టారు.
ఈ నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారు?
A: ఆర్డిటి లబ్ధిదారులు, మహిళలు, కళాకారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: